Saturday, January 18, 2025
Homeసినిమాఅంతకు మించి.. సలార్ ఉంటుంది - పృథ్వీరాజ్

అంతకు మించి.. సలార్ ఉంటుంది – పృథ్వీరాజ్

ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘సలార్‘. ఇందులో ప్రభాస్ సరసన శృతిహాసన్ నటిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే.. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటించిన ‘సాహో’, ‘రాధేశ్యామ్’ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాయి. నెక్ట్స్ ‘ఆదిపురుష్’ మూవీ చేస్తున్నప్పటికీ.. అది రామాయణం ఆధారంగా రూపొందుతోన్న సినిమా. రెగ్యులర్ కమర్షియల్ మూవీ కాదు కాబట్టి ప్రభాస్ సలార్ మూవీ పై చాలా ఆశలు పెట్టుకున్నాడు.

ఈ మూవీ ఫస్ట్ లుక్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో సలార్ పై భారీ అంచనాలు ఉన్నాయి. మాస్ యాక్షన్ ఎంటర్‌‌టైనర్‌‌గా రూపొందుతోన్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్‌లో భారీ యాక్షన్ షెడ్యూల్‌ను షూట్ చేస్తున్నారు. దీని కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్‌ను ప్రశాంత్ నీల్ రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది. వాళ్లు రూపొందించిన డిజైన్ చేసిన యాక్షన్స్ సీన్స్‌ సినిమాకు  హైలైట్‌గా నిలుస్తాయని చెబుతున్నారు. ప్రభాస్‌తో పాటు విలన్‌ పాత్ర పోషిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఈ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

ఈ సందర్భంగా పృథ్వీరాజ్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రశాంత్ నీల్ విజన్‌, ఆయన దర్శకత్వ ప్రతిభకు తాను ఫిదా అయ్యానని చెప్పుకొచ్చాడు. ఇందులోని యాక్షన్ ఎడిసోడ్స్ ప్రేక్షకుల ఊహకు అందని విధంగా ఉంటాయి అన్నారు. ఇంకా చెప్పాలంటే.. ఎవరెన్ని అంచనాలతో వచ్చినా అంతకు మించి అనేలా సలార్ ఉంటుందని చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఈ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచేస్తున్నాయి. వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న సలార్ విడుదల కానుంది. బాహుబలికి మించిన సక్సెస్ ను సలార్ సాధిస్తుందేమో.

RELATED ARTICLES

Most Popular

న్యూస్