Sunday, January 19, 2025
Homeసినిమా'సలార్' టీజర్ కు ముహుర్తం ఫిక్స్

‘సలార్’ టీజర్ కు ముహుర్తం ఫిక్స్

ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ సలార్. ఈ చిత్రానికి కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో ప్రభాస్ కు జంటగా శృతిహాసన్ నటిస్తుంది. అవుట్ అండ్ అవుట్ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి సలార్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన తర్వాత అయితే.. ప్రభాస్ కు బాహుబలి 2 కంటే పెద్ద విజయాన్ని అందించే సినిమా ఇదే అంటూ అభిమానులు సలార్ సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్నారు.

ఇక ఎప్పుడెప్పుడు సలార్ టీజర్ వస్తుందా అని ఎదురు చూసిన అభిమానులకు సలార్ మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. సలార్ టీజర్ ను ఈ నెల 6న ఉదయం 5 గంటల 12 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టుగా తెలియచేస్తూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంటుంది. అయితే.. ఏ సినిమా ఫస్ట్ లుక్ అయినా.. టీజర్ అయినా ఉదయం తొమ్మిది తర్వాతో లేదా మధ్యాహ్నాం, సాయంత్రం ఇంకా ఆలస్యంగా అనుకుంటే రాత్రి రిలీజ్ చేస్తారు కానీ.. ఇంత వరకు ఉదయం 5 గంటలకు ఏ సినిమా టీజర్ రిలీజ్ చేయలేదని చెప్పచ్చు. మొత్తానికి సలార్ సందడి స్టార్ట్ అయ్యింది. ఈ భారీ పాన్ ఇండియా మూవీని సెప్టెంబర్ 28న విడుదల చేయనున్నారు. మరి.. సలార్ టీజర్ ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్