Sunday, January 19, 2025
Homeసినిమాఇప్పుడు అందరి దృష్టి 'సలార్' పైనే!

ఇప్పుడు అందరి దృష్టి ‘సలార్’ పైనే!

అవును .. ప్రభాస్ అభిమానులందరూ ఇప్పుడు ‘సలార్’ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఆయన కెరియర్ కి ఈ సినిమా కీలకంగా మారింది. ‘బాహుబలి’ తరువాత ప్రభాస్ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. ఆయన వరుసగా పాన్ ఇండియా సినిమాలను ఒప్పేసుకున్నాడు. ఒక్కో సినిమా వందల కోట్ల బడ్జెట్ తో నిర్మితం కావడం మొదలైంది. ప్రభాస్ నుంచి ఒక సినిమా వస్తుందంటే, బాలీవుడ్ హీరోలు సైతం తమ సినిమాల రిలీజ్ ను వాయిదా వేసుకునే పరిస్థితి వచ్చింది.

అలా ప్రభాస్ చేసిన ‘సాహో’ .. ‘రాధేశ్యామ్’ సినిమాలు భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కాయి. ఓపెనింగ్స్ విషయంలో కొత్త రికార్డులను నమోదు చేశాయి. అయితే ఈ రెండు సినిమాల విషయంలో తెరపై ఖర్చు తప్ప ‘కథ’ కనిపించలేదు. కథగా చెబుతున్నదానిలో కొత్తదనం లేదు. దాంతో ఆయన అభిమానులంతా చాలా నిరాశపడ్డారు. ఆ సమయంలో వారికి ఆశా దీపంలా అనిపించిన సినిమా ‘ఆదిపురుష్’. ఈ సినిమా తప్పకుండా సంచలనాన్ని నమోదు చేస్తుందని వాళ్లంతా గట్టిగా నమ్మారు.  అయితే ఆ నమ్మకానికి ఈ సినిమా చాలా దూరంలోనే నిలిచిపోయింది.

ఇక ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ దృష్టి ‘సలార్’పైనే ఉంది. ఇది ప్రభాస్ మాస్ ఇమేజ్ కి తగిన కంటెంట్ తో రూపొందుతున్న సినిమా. పైగా ‘కేజీఎఫ్’ మేకర్స్ నుంచి వస్తున్న సినిమా. అందువలన భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వచ్చిన పోస్టర్స్ ఒక రేంజ్ లో అభిమానులకు కనెక్ట్ అయ్యాయి. దాంతో ఈ సినిమా వసూళ్ల పరంగా సునామీని సృష్టించడం ఖాయమనే అభిప్రాయంతో ఉన్నారు. పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ కెరియర్లో కీలకమైన సినిమాగానే దీనిని గురించి చెప్పుకోవాలి. ఈ ఏడాది సెప్టెంబర్ 28న వస్తున్న ఈ సినిమా, అభిమానుల అంచనాలను ఎంతవరకూ అందుకుంటుందనేది చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్