Teaser not now: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా మూవీ సలార్. ఇందులో ప్రభాస్ సరసన అందాల తార శృతిహాసన్ నటిస్తోంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ ఆమధ్య రిలీజ్ చేయడం.. దీనికి ట్రెమండస్ రెస్పాన్స్ రావడం తెలిసిందే. అయితే.. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన తాజా చిత్రం కేజీఎఫ్ 2 చరిత్ర సృష్టించడంతో సలార్ సినిమా పై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
అయితే.. సలార్ ఇప్పటి వరకు ముప్పై శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజా షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఇదిలా ఉంటే.. సలార్ టీజర్ ను ఈ నెలాఖరున విడుదల చేయనున్నారని వార్తలు వచ్చాయి. లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే… ఇప్పుడు సలార్ టీజర్ రిలీజ్ వాయిదా పడిందట. ఈ నెలలో సలార్ టీజర్ వస్తుందని ఆతృతగా ఎదురు చూసిన అభిమానులకు ఇది నిరాశే. మరి.. టీజర్ ఎప్పుడు వస్తుందంటే.. జూన్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
అయితే.. కేజీఎఫ్ సెన్సేషన్ క్రియేట్ చేసినప్పటి నుంచి సలార్ అప్ డేట్స్ కోసం అభిమానులు చాలా కేజ్రీగా ఎదురు చూస్తున్నారు. అలాగే ప్రశాంత్ నీల్ సలార్ పై ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని కథ పై మరింతగా కసరత్తు చేస్తున్నారు. బాహుబలి హీరో ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలిసి చేస్తోన్న ఈ భారీ పాన్ ఇండియా మూవీ సలార్ చరిత్ర సృష్టించడం ఖాయమని టాక్ బలంగా వినిపిస్తోంది.