Sunday, January 19, 2025
Homeసినిమామ‌హేష్ స‌ర‌స‌న స‌మంత‌..?

మ‌హేష్ స‌ర‌స‌న స‌మంత‌..?

Mahesh-Samantha: సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం న‌టిస్తున్న చిత్రం ‘స‌ర్కారు వారి పాట‌’. ‘గీత గోవిందం’ ఫేమ్ ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న స‌ర్కారు వారి పాటలో మ‌హేష్ స‌ర‌స‌న మ‌ల‌యాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ న‌టిస్తుంది. ఓ ఇర‌వై రోజులు షూటింగ్ బ్యాలెన్స్ ఉంద‌ని స‌మాచారం. అయితే.. ఇటీవ‌ల మ‌హేష్ మోకాలికి స‌ర్జ‌రీ చేయించుకోవ‌డం వ‌ల‌న షూటింగ్ కి బ్రేక్ ప‌డింది. ఫిబ్ర‌వ‌రి నుంచి తిరిగి షూటింగ్ స్టార్ట్ చేయాలి అనుకున్నారు కానీ.. జ‌న‌వ‌రి నుంచి తాజా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా త‌ర్వాత మ‌హేష్‌.. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తో సినిమా చేయ‌నున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై నిర్మించ‌నున్నారు. అత‌డు, ఖ‌లేజా చిత్రాల త‌ర్వాత మ‌హేష్, త్రివిక్ర‌మ్ కాంబినేస‌న్లో రూపొందుతోన్న ఈ చిత్రానికి సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ సంగీతం అందించ‌నున్నారు. అయితే.. గ‌తంలో ఈ సినిమా కోసం మ‌హేష్ స‌ర‌స‌న క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డేని క‌న్ ఫ‌ర్మ్ చేశారు.

ఇప్పుడు పూజా బిజీగా ఉండ‌డంతో.. డేట్స్ ప్రాబ్ల‌మ్ రావ‌డంతో ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకుంద‌ని.. తాజాగా స‌మంత‌ని క‌న్ ఫ‌ర్మ్ చేశార‌ని టాక్ వినిపిస్తోంది. మ‌హేష్ తో క‌లిసి స‌మంత దూకుడు, సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు, బ్ర‌హ్మోత్స‌వం చిత్రాల్లో న‌టించింది. మ‌రి.. వీరిద్ద‌రి తాజా చిత్రం గురించి త్వ‌ర‌లో అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేస్తారేమో చూడాలి.

Also Read : మ‌హేష్‌, ప‌వ‌న్ కి థ్యాంక్స్ చెప్పిన రాజ‌మౌళి

RELATED ARTICLES

Most Popular

న్యూస్