Pushpa-Samantha: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందిన పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. దీంతో ‘పుష్ప2’ పై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎప్పుడెప్పుడు పుష్ప 2 షూటింగ్ స్టార్ట్ అవుతుందా..? ఎప్పుడు థియేటర్లోకి వస్తుందా..? అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకాభిమానులు.
ఇదిలా ఉంటే.. పుష్ప 2 మూవీలో ఐటం సాంగ్ ను బాలీవుడ్ బ్యూటీ దిశా పటానితో చేయించనున్నారని టాక్ బయటకు వచ్చింది. యూత్ లో ఆమెకు బాగా క్రేజ్ ఉండడంతో ఐటం సాంగ్ ను ఆమెతోనే చేయించాలని ఫిక్స్ అయ్యారట. అయితే.. సమంత అంటే సుకుమార్ కు విపరీతమైన అభిమానం. ఆ అభిమానంతోనే పుష్ప మూవీలో సాంగ్ ప్రత్యేకంగా పెట్టారు. ఇప్పుడు పుష్ప 2 లో సమంత కోసం కీలక పాత్రను డిజైన్ చేశారట సుకుమార్.
Also Read : పుష్ప … ఇంకా చాలా ఉంది….