Saturday, January 18, 2025
Homeసినిమాసంపూర్ణేష్ బాబు హీరోగా ‘మిస్ట‌ర్ బెగ్గ‌ర్’ షూటింగ్ ప్రారంభం

సంపూర్ణేష్ బాబు హీరోగా ‘మిస్ట‌ర్ బెగ్గ‌ర్’ షూటింగ్ ప్రారంభం

Sampoornesh Babu New Movie Launched :

కార్తిక్ మూవీ మేక‌ర్స్ ప‌తాకం పై శ్రీమ‌తి వ‌డ్ల నాగశార‌ద స‌మ‌ర్ప‌ణ‌లో బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు, అద్వితి శెట్టి హీరో హీరోయిన్లుగా వ‌డ్ల జ‌నార్థ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో గురురాజ్, కార్తిక్ నిర్మిస్తోన్న చిత్రం ‘మిస్ట‌ర్ బెగ్గ‌ర్’. ఈ చిత్ర ప్రారంభోత్స‌వం ఈ రోజు రామానాయుడు స్టూడియోలో ఘ‌నంగా జ‌రిగింది. ముహూర్త‌పు స‌న్నివేశానికి న‌టుడు స‌త్య ప్ర‌కాష్ క్లాప్ కొట్ట‌గా కార్తీ మూవీ మేక‌ర్స్ అధినేత, నిర్మాత రాజు కెమెరా స్విచాన్ చేశారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వి. స‌ముద్ర గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

న‌టుడు స‌త్య ప్ర‌కాష్ మాట్లాడుతూ “ఈ చిత్రంలో నేను భ‌ద్ర అనే పాత్ర‌లో మెయిన్ విల‌న్ గా న‌టిస్తున్నా. యువ నిర్మాత‌లు, యువ టెక్నీషియన్స్ ప‌ని చేస్తోన్న ఈ చిత్రంలో న‌టించ‌డం చాలా సంతోషంగా ఉంద”న్నారు.

హీరో సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ “ద‌ర్శ‌కుడు జ‌నార్ధన్ గారు అద్భుత‌మైన స్క్రిప్ట్ తో ఈ సినిమా చేస్తున్నారు.  ఈ సినిమా గోవా బ్యాక్ డ్రాప్ లో చాలావ‌ర‌కు ఉంటుంది. వ‌చ్చే నెల‌లో గోవా షెడ్యూల్ ప్లాన్ చేశాం. ‘హృద‌య కాలేయం’ చిత్రం నుంచి న‌న్ను ఇప్ప‌టివ‌ర‌కూ ఆద‌రిస్తూ వ‌చ్చారు. ఈ సినిమాను కూడా అదే విధంగా ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నాను. ఎన్నో పెద్ద చిత్రాల్లో న‌టించిన స‌త్య ప్ర‌కాష్ గారితో న‌టించ‌డం చాలా హ్యాపీ. ఇంకా  చాలా మంది సీనియ‌ర్ ఆర్టిస్ట్స్ మా సినిమాలో న‌టిస్తున్నారు” అన్నారు.

ద‌ర్శ‌కుడు వ‌డ్ల జ‌నార్థ‌న్ మాట్లాడుతూ “మిస్ట‌ర్ బెగ్గ‌ర్ టైటిల్ కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. స‌ర‌దా స‌ర‌దాగా సాగే కుటుంబ క‌థాచిత్రానికి మంచి వినోదం పొందుప‌రిచాము. సంపూ మేనరిజానికి త‌గ్గ‌ట్టుగా స్క్రిప్ట్ రెడీ చేశాం. బాంబే, చెన్నై, గోవాల్లో సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ ప్లాన్ చేశాం” అన్నారు.

Also Read :  సంపూర్ణేష్ బాబు ‘క్యాలీఫ్లవర్‌’ 26న విడుదల

RELATED ARTICLES

Most Popular

న్యూస్