Sunday, November 24, 2024
Homeసినిమాయాక్షన్ కథలపై యంగ్ హీరోల మోజు!

యాక్షన్ కథలపై యంగ్ హీరోల మోజు!

వెండి తెరపై ప్రేమకథా చిత్రాలకు లభించే ఆదరణ ఎక్కువ. కథలో విషయం ఉంటే హీరో ఏజ్ కాస్త ఎక్కువైనా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు. లేదంటే ముదురు ప్రేమకథలు మాకు వద్దని చెప్పేసి పక్కన పెట్టేస్తారు. ఇక కొన్ని లవ్ స్టోరిస్ చేసిన హీరోలు, యూత్ నుంచి మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంటున్నారు. రామ్ .. నాగశౌర్య వంటి హీరోలకు అమ్మాయిల్లోనే క్రేజ్ ఎక్కువ. అలాంటి హీరోలు ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలను చేస్తే జనం నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.

అంతే .. ఇక అప్పటి నుంచి యంగ్ హీరోల ఆలోచన మారిపోతోంది. ఇక తాము మాస్ యాక్షన్ సినిమాలు చేయాలనీ .. మాస్ హీరో అనిపించుకోవాలని ఆరాటపడుతున్నారు. అలాంటి కథలనే ఎంచుకుంటున్నారు .. ఆ జోనర్లో శభాష్ అనిపించుకున్న దర్శకులతో కలిసి సెట్స్ పైకి వెళుతున్నారు. బడ్జెట్ పరంగా భారీ యాక్షన్ సినిమాలనే చేస్తూ వెళుతున్నారు. అవసరమైతే డూప్ కూడా లేకుండా సాహసాలు చేయడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారు.

అయితే యాక్షన్ జోనర్లోకి అడుగుపెట్టిన యంగ్ హీరోల్లో సక్సెస్ రేట్ చాలా తక్కువ కనిపిస్తోంది. కథలో యాక్షన్ ఒక భాగమైతే ఓకే గానీ .. యాక్షన్ ను మాత్రమే ప్రధాన ఇతివృత్తంగా చేసుకుని ముందుకు వెళితే మాత్రం దెబ్బతింటున్నారు. రామ్ .. నితిన్ .. నాగశౌర్య …. సుధీర్ బాబు గ్రాఫ్ ను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఇక తాజాగా సందీప్ కిషన్ కూడా ‘మైఖేల్’ సినిమాతో మాస్ యాక్షన్ వైపు వెళ్లి, ఇదే విషయాన్ని మరోసారి నిరూపించాడు. అందువల్లనే యంగ్ హీరోలు తమ నుంచి ఆడియన్స్ ఎలాంటి కథలను ఆశిస్తున్నారనేది అర్థం చేసుకుని ముందుకు వెళితే బాగుంటుందేమో.

Also Read : సందీప్ కిషన్ యాక్షన్ డోస్ కాస్త తగ్గిస్తే బాగుండేదేమో!

RELATED ARTICLES

Most Popular

న్యూస్