Saturday, January 18, 2025
Homeసినిమా‘మైఖేల్’ టీజర్ విడుదల

‘మైఖేల్’ టీజర్ విడుదల

సందీప్ కిషన్ , రంజిత్ జయకోడి దర్శకత్వంలో తెరకక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘మైఖేల్’. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పి సంయుక్త నిర్మాణంలో ఈ సినిమా రూపొందింది. డిస్ట్రిబ్యూటర్ భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావుల సంయుక్త ప్రొడక్షన్ వెంచర్ ‘మైఖేల్’. దివంగత శ్రీ. నారాయణ్ దాస్ కె నారంగ్ సమర్పకులు.

ఈ రోజు ఈ చిత్రం తెలుగు టీజర్‌ను నాని విడుదల చేయగా, ధనుష్ తమిళ వెర్షన్‌ను, దుల్కర్ సల్మాన్ మలయాళ వెర్షన్‌ను, కన్నడ టీజర్‌ను రక్షిత్ శెట్టి విడుదల చేశారు. హిందీ టీజర్‌ను రాజ్ కుమార్ రావ్, రకుల్ ప్రీత్ సింగ్, జాన్వీ కపూర్, రాజ్ & డీకే విడుదల చేశారు. టీజర్ ‘మైఖేల్’ యొక్క ముఖ్యమైన గ్లింప్స్ ని రివిల్ చేసింది. అలాగే, విజయ్ సేతుపతి పాత్రతో పాటు గౌతమ్ మీనన్ విలనిజం ఆవిష్కరించింది. 80 నేపధ్యంలో సాగే ఈ కథలో నటీనటుల గెటప్‌లు, నాటి పరిస్థితులు అద్భుతంగా రిక్రియేట్ చేశారు.

టీజర్ సినిమాలోని మూడు ప్రముఖ పాత్రలని పరిచయం చేస్తూ ప్రారంభమవుతుంది. ”వేటాడటం రాని జంతువులే వేటాడే నోటికి చిక్కుతాయి ‘మైఖేల్’ అని మాస్టర్ చెప్పగా .. ‘వెంటాడి ఆకలి తీర్చుకోవడానికి వేటాడటం తెలియాల్సిన పని లేదు మాస్టర్” అని మైఖేల్ బదులు ఇవ్వడం టెర్రిఫిక్ గా వుంది. సందీప్ కిషన్, విజయ్ సేతుపతి , గౌతమ్ మీనన్ ల రగ్గడ్ డాషింగ్ గెటప్స్, ఇంటెన్స్ డైలాగులు, స్టీమీ రొమాన్స్ ఇవన్నీ క్యూరియాసిటీని పెంచుతూ సినిమా పూర్తి వినోదాత్మక ప్యాకేజీగా కనిపిస్తోంది.

సందీప్ కిషన్ తన వైల్డ్ సైడ్‌ను చూపించాడు. యాక్షన్ సీక్వెన్స్‌లు మైండ్ బ్లోయింగా వున్నాయి. తనను తాను బీస్ట్ మోడ్‌గా మార్చుకుని, కండలు తిరిగిన దేహంతో మునుపెన్నడూ లేని విధంగా సరికొత్తగా కనిపించాడు సందీప్ కిషన్. రొమాంటిక్ ట్రాక్ ని కూడా యాక్షన్ పార్ట్ లా చూపించడం ఆసక్తికరంగా వుంది. టీజర్‌లో వరలక్ష్మి శరత్‌కుమార్, వరుణ్ సందేశ్ , అనసూయ భరద్వాజ్‌లు కూడా మెరిసారు. తెలుగు వెర్షన్‌కి త్రిపురనేని కళ్యాణ్ చక్రవర్తి డైలాగ్స్ రాశారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.

Also Read: ‘మైఖేల్’టీజర్ అక్టోబర్ 20 న విడుదల

RELATED ARTICLES

Most Popular

న్యూస్