Saturday, January 18, 2025
Homeసినిమా'ధమాకా' డైరెక్టర్ తో సందీప్ కిషన్!

‘ధమాకా’ డైరెక్టర్ తో సందీప్ కిషన్!

సందీప్ కిషన్ హీరోగా చేసిన ‘ఊరుపేరు భైరవకోన’ సినిమా ఇటీవలే థియేటర్లకు వచ్చింది. వీఐ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఆ తరువాత సందీప్ కిషన్ చేయనున్న ప్రాజెక్టు ఏమిటనేది తెలియాల్సి ఉంది. త్వరలో ఆయన నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. ఇది పూర్తిగా కమర్షియల్ ఎంటర్టైనర్ అని అంటున్నారు. నిర్మాణ సంస్థగా ‘హాస్య మూవీస్’ పేరు వినిపిస్తోంది.

మాస్ కంటెంట్ తో మెప్పించే దర్శకుడిగా నక్కిన త్రినాథరావుకి మంచిపేరు ఉంది. ఆయన నుంచి వచ్చిన ‘సినిమా చూపిస్త మావ’ .. ‘నేను లోకల్’ .. ‘ధమాకా’ సినిమాలు ఈ విషయాన్ని నిరూపించాయి. ఈ మూడు సినిమాలు యూత్ ను కూడా ఆకట్టుకున్నాయి. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి కూడా మంచి మార్కులు కొట్టేశాయి. అలాంటి తరహాలోనే ఆయన ఇప్పుడు ఒక కథను రెడీ చేసుకున్నాడట.

నక్కిన త్రినాథరావు తాను సిద్ధం చేసుకున్న కథకి సందీప్ కిషన్ అయితే కరెక్టుగా ఉంటాడని ఆయన సంప్రదించడం .. సందీప్ కిషన్ ఓకే చెప్పడం జరిగిపోయాయని అంటున్నారు. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైపోయాయని టాక్. ఈ సినిమాకి ‘ఓరి నాయనో’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. ఇక కథానాయికగా ఎవరిని తీసుకోనున్నారు? రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది? అనే విషయాలు త్వరలోనే తెలియనున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్