Sunday, September 8, 2024
Homeసినిమారణబీర్ కపూర్, సందీప్ రెడ్డి 'యానిమల్' ప్రారంభం

రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి ‘యానిమల్’ ప్రారంభం

Animal: ‘అర్జున్ రెడ్డి’తో సంచలనం సృష్టించి, హిందీలో రీమేక్ ‘కబీర్ సింగ్‌’ తో భారీ బ్లాక్ బస్టర్‌ను అందించిన సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్‌తో కలిసి మరో బ్లాక్ బస్టర్ విజయానికి శ్రీకారం చుట్టారు. భూషణ్‌కుమార్‌, ప్రణవ్‌రెడ్డి వంగ కలిసి ఈ చిత్రాన్ని టి సిరీస్‌, భద్రకాళి పిక్చర్స్ పై ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. కథానాయకుడి పాత్రకి తగ్గట్టు ఈ చిత్రానికి ‘యానిమల్’అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు. భారీ అంచనాలు వున్న ఈ చిత్రం కోసం పవర్ ఫుల్ సబ్జెక్ట్ ని రెడీ చేశారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.

రణబీర్ కపూర్ ని ఈ చిత్రంలో పూర్తిగా భిన్నమైన పాత్రలో చూపించనున్నారు. ఈ సినిమా కోసం రణబీర్ స్పెషల్ గా మేకోవర్ అయ్యారు. యాక్షన్ న్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘యానిమల్’ చిత్రం ఈ రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభయింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ఈ రోజు నుంచే హిమాలయాల్లో మొదలైయింది. భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న‌ యానిమల్ హిందీతో పాటు దక్షిణాది భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది.

రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగాల క్రేజీ కాంబినేషన్ లో రాబోతున్న ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో ప్రముఖ నటీనటులు కనిపించనున్నారు. ఆగస్ట్ 11, 2023 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

Also Read : పెళ్లి బంధంతో ఒక్కటైన ప్రేమ పక్షులు

RELATED ARTICLES

Most Popular

న్యూస్