Sunday, January 19, 2025
Homeసినిమా'దళపతి 67' లో సంజయ్ దత్, ప్రియా ఆనంద్

‘దళపతి 67’ లో సంజయ్ దత్, ప్రియా ఆనంద్

మాస్టర్, వారసుడు వంటి బ్లాక్‌బస్టర్ విజయాల తర్వాత మూడవసారి విజయ్‌తో కలిసి ప్రొడక్షన్ హౌస్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘దళపతి 67‘ అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. ‘మాస్టర్’ తో మాసీవ్ సక్సెస్ అందుకున్న దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కలయికలో వస్తున్న రెండో ప్రాజెక్ట్ ఇది. ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మించగా, జగదీష్ పళనిసామి సహ నిర్మాత. జనవరి 2, 2023న ప్రారంభమైన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

సంజయ్ దత్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో చేరారు. ఈ చిత్రంలో భాగం అయినందుకు ఆనందం వ్యక్తం చేశారు. ‘దళపతి 67’ వన్ లైనర్ విన్నప్పుడే ఈ చిత్రంలో భాగం అవుతానని తెలుసు. ఈ ప్రయాణాన్ని ప్రారంభించినందుకు చాలా థ్రిల్‌గా వుంది’’ అన్నారు సంజయ్ దత్. ఈ సినిమాలో ప్రియా ఆనంద్ కూడా భాగం కానుంది. ‘దళపతి 67’లో భాగమైనందుకు థ్రిల్‌గా ఉంది. ఇటువంటి అద్భుతమైన తారాగణం, టీంతో కలిసి పని చేయడానికి ఎదురుచూస్తున్నాను! అన్నారు ప్రియా ఆనంద్.

కత్తి, మాస్టర్, బీస్ట్‌ చిత్రాలతోచార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లను అందించిన రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్‌.. ‘దళపతి 67’ కోసం నాల్గవ సారి విజయ్ తో కలసి పని చేస్తున్నారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫర్ గా,  ఫిలోమిన్ రాజ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. ఎన్. సతీస్ కుమార ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి రామ్ కుమార్ బాలసుబ్రమణియన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.

RELATED ARTICLES

Most Popular

న్యూస్