Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్Indian Team for SA ODI Series:  వైస్ కెప్టెన్ గా సంజూ శామ్సన్

Indian Team for SA ODI Series:  వైస్ కెప్టెన్ గా సంజూ శామ్సన్

సౌతాఫ్రికాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్ కు సంజూ శామ్సన్ జట్టులో చేరనున్నాడు. అతనికి వైస్ కెప్టెన్ గా కూడా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 11 వరకూ.. మూడు టి20లు, మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ ఆడేందుకు సౌతాఫ్రికా జట్టు ఇండియాలో పర్యటిస్తోంది. రేపు సెప్టెంబర్ 28న తొలి టి 20 మ్యాచ్ తిరువనంతపురంలో జరగనుంది. అక్టోబర్ 2, 4 తేదీల్లో గువహతి, ఇండోర్ లలో మిగతా రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. అక్టోబర్ 6,9,11 తేదీల్లో వన్డే మ్యాచ్ లు లక్నో, రాంచీ, ఢిల్లీ వేదికలుగా జరగనున్నాయి.

రోహిత్ శర్మ నేతృత్వంలో టి20 జట్టును గతంలోనే ప్రకటించగా, వన్డే జట్టును రేపో మాపో ప్రకటించనున్నారు.  వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో మొదలు కానున్న టి 20 వరల్డ్ కప్ కు ముందు ఆ టోర్నీలో ఆటగాళ్లకు కొంత విరామం ఇవ్వాలని బిసిసిఐ యోచిస్తోంది. అందుకే శిఖర్ ధావన్ నేతృత్వంలో వన్డే జట్టును బరిలోకి దింపనుంది. ఈ జట్టులో సంజూను వైస్ కెప్టెన్ గా బాధ్యతలు ఇవ్వనున్నారు. ఐపీఎల్ లో సత్తా చాటిన రజిత్ పటీదార్ తొలిసారి అంతర్జాతీయ మ్యాచ్ ఆడే అవకాశం ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్