Tuesday, February 25, 2025
Homeసినిమాసరైన కథ కోసం సంతోష్ కాస్త ఆగాల్సిందే!

సరైన కథ కోసం సంతోష్ కాస్త ఆగాల్సిందే!

సంతోష్ శోభన్ యువ కథనాయకులలో తన ప్రత్యేకతను చాటుకోవడానికి గట్టిగానే కష్టపడుతున్నాడు. ఫైట్లలోను .. డాన్సులలోను మంచి ఈజ్ చూపిస్తున్నాడు. ముఖ్యంగా సినిమాకి .. సినిమాకి మధ్య గ్యాప్ లేకుండా చూసుకుంటున్నాడు. తెరపై ఉన్నంతసేపు చాలా యాక్టివ్ గానే ఆడియన్స్ దృష్టిని తనవైపుకు లాక్కుంటున్నాడు. రొమాన్స్ కి సంబంధించిన సన్నివేశాల్లోను మంచి స్పీడ్ చూపిస్తున్నాడు.

అయితే ఆశించిన స్థాయిలో సక్సెస్ లను అందుకోలేకపోతున్నాడు. సంతోష్ అదృష్టం బాగుండి ఆయనకి వరుసగా అవకాశాలు వస్తున్నాయి. యంగ్ డైరెక్టర్లతో  .. పెద్ద బ్యానర్లలో అతను సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. కానీ సరైన హిట్ మాత్రం ఇంతవరకూ పడలేదు. అందుకు కారణం అతను కథపై పెద్దగా దృష్టి పెట్టకపోవడమేనని తెలుస్తోంది. కథను విడిచి సాముచేస్తే ఏదైతే జరుగుతుందో .. అదే జరుగుతూ వస్తోంది.

యంగ్ హీరోగా సంతోష్ కి ఆ మాత్రం ఉత్సాహం ఉండవలసిందే. అయితే ఉత్సాహానికీ .. దూకుడికి మధ్య గల తేడానే అతనికి తెలియడం లేదు. ఆ తొందరపాటుతోనే చాలా వేగంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అంతే స్పీడ్ గా థియేటర్స్ ఖాళీ చేసి వెళుతున్నాడు. అందువలన ఆయన కాస్త ఆలోచన చేయవల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన హీరోగా రూపొందిన ‘శ్రీదేవి శోభన్ బాబు’ ఈ నెల 18న రానుంది. మరి ఈ సినిమా అయినా ఆయనకి హిట్ తెచ్చిపెడుతుందేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్