Sunday, January 19, 2025
Homeసినిమా'స‌ర్కారు వారు...' ఏం చేస్తున్నారు.?

‘స‌ర్కారు వారు…’ ఏం చేస్తున్నారు.?

Action Sarkar:  సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టిస్తున్న తాజా చిత్రం స‌ర్కారు వారి పాట‌. ఈ చిత్రానికి గీత గోవిందం ఫేమ్ ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. బ్యాంకు స్కామ్ చుట్టూ తిరిగే విభిన్న క‌థాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రం ప్ర‌స్తుతం హైద‌రాబాద్ అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో షూటింగ్ జ‌రుపుకుంటుంది. మ‌హేష్ మ‌రి కొంద‌రు ఫైట‌ర్స్ పై యాక్ష‌న్ సీన్స్ చిత్రీక‌రిస్తున్నారు. ఫైట్ మాస్ట‌ర్ రామ్ ల‌క్ష్మ‌ణ్ నేతృత్వంలో యాక్ష‌న్ సీన్స్ ను చిత్రీక‌రిస్తున్నారు.

తాజా షెడ్యూల్ మరికొన్ని రోజుల పాటు ఉంటుంద‌ని స‌మాచారం. దుబాయ్, గోవా, స్పెయిన్ లలో చిత్రీకరించిన ఫైట్ సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా  నిలుస్తుందని అంటున్నారు . అలాగే హైద‌రాబాద్ లో ప్ర‌స్తుతం షూట్ చేస్తున్న ఫైట్స్ సీన్స్ కూడా ప్రేక్షకులతో విజిల్స్ వేయించడం ఖాయమని అంటున్నారు. ఈ చిత్రానికి సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్ఎస్ త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని తెలుగుతో పాటు త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో మే 12న భారీ స్థాయిలో విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు

Also Read :  త్వరలో ‘స‌ర్కారు వారి…’ మాస్ పాట

RELATED ARTICLES

Most Popular

న్యూస్