Sunday, January 19, 2025
Homeసినిమామే 2న సర్కారు వారి పాట' థియేట్రికల్ ట్రైలర్

మే 2న సర్కారు వారి పాట’ థియేట్రికల్ ట్రైలర్

Trailer on the way: సూపర్ స్టార్ మహేష్ బాబు న‌టించిన తాజా చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా ఇప్పటికే అదిరిపోయే ప్రమోషనల్ కంటెంట్ తో దూసుకుపోతుంది. ఇప్పుడా అంచనాలని మరో స్థాయికి తీసుకువెళ్ళడానికి పక్కా మాస్, యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్‌ను సిద్ధం చేస్తోంది చిత్ర యూనిట్. తాజాగా ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారైయింది. భారీ అంచనాలు నెలకొన్న సర్కారు వారి పాట థియేట్రికల్ ట్రైలర్ మే 2న విడుదల కానుంది.

ఈ సందర్భంగా విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ పోస్టర్ లో మహేష్ బాబు కంప్లీట్ యాక్షన్ లుక్ లో కనిపించారు. రెండు చేతుల్లో తాళల గుత్తులు పట్టుకొని వంటికాలి పై నిల్చుని రౌడీ గ్యాంగ్ తో హైవోల్టేజ్ ఫైట్ చేస్తున్న విజువల్ ఈ పోస్టర్ లో కనిపించడం అభిమానులని అలరించింది. సూపర్ స్టార్ మహేష్ బాబును మునుపెన్నడూ చూడని మాస్ రోల్ లో చూపించబోతున్నారు బ్లాక్ బస్టర్ దర్శకుడు పరశురాం.

ఈ చిత్రంలో డిఫరెంట్ షేడ్స్ వున్న పాత్రని పోషిస్తున్న మహేష్, తన పాత్ర కోసం సరికొత్తగా సూపర్ స్టైలిష్ గా మేకోవర్ అయ్యారు. సంగీత సంచలనం ఎస్ థమన్ ప్రస్తుతం ట్రైలర్ కోసం బీజీఏం స్కోర్ చేయడంలో బిజీగా ఉన్నారు. సర్కారు వారి పాట రెగ్యులర్ అప్డేట్స్ తో సందడి చేస్తుంది. త్వరలోనే మహేష్ బాబు, కీర్తి సురేష్‌లపై చిత్రీకరించిన మాస్ సాంగ్‌ను కూడా విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తుంది. సర్కారు వారి పాట మే 12న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్