Sunday, January 19, 2025
Homeసినిమాతమిళంలో కూడా స‌ర్కారు వారి పాట‌

తమిళంలో కూడా స‌ర్కారు వారి పాట‌

Tamil Paata:  సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టించిన తాజా చిత్రం స‌ర్కారు వారి పాట‌. ఈ చిత్రానికి గీత గోవిందం ఫేమ్ ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మ‌హేష్ స‌ర‌స‌న ఇందులో మ‌ల‌యాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ న‌టించింది. ఈ సినిమా నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు రిలీజ్ చేసిన పాట‌ల‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ రావ‌డంతో సినిమా పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. త్వ‌ర‌లోనే ఈ సినిమా నుంచి మాస్ సాంగ్ రిలీజ్ చేయ‌నున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాను తెలుగుతో పాటు త‌మిళ్ లో కూడా రిలీజ్ చేయ‌నున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. మేక‌ర్స్ నుంచి ఎలాంటి అనౌన్స్ మెంట్ లేక‌పోవ‌డంతో ఇది నిజ‌మా కాదా అనే అనుమానం ఉంది. తాజా అప్ డేట్ ఏంటంటే.. స‌ర్కారు వారి పాట త‌మిళ్ లో కూడా రిలీజ్ కావ‌డం అనేది నిజమే అని తెలిసింది. తమిళ సినీ వర్గాలు కన్ఫర్మ్ చేశాయ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

ఆల్రెడీ ఈ చిత్రం డబ్బింగ్ పనుల్లో ఉందని పాటలు సహా ఇతర అన్ని కీలక అప్ డేట్స్ తమిళ్ నుంచి కూడా ఉంటాయని ఇప్పుడు తెలుస్తోంది. దీనితో ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ్ రిలీజ్ కూడా ఏకకాలంలో ఉంటుంది అని కన్ఫర్మ్ అయ్యింది. మ‌రి.. త‌మిళ్ లో స‌ర్కారు వారు ఎంత వ‌ర‌కు మెప్పిస్తారో చూడాలి.

Also Read : 

సర్కారు వారి పాట’ ఫస్ట్ సింగల్ సరికొత్త రికార్డ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్