స్విస్ ఓపెన్-2023లో భారత ఆటగాళ్ళు సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టిలు పురుషుల డబుల్స్ లో సెమీస్ లో అడుగు పెట్టారు. గత అర్థరాత్రి హోరాహోరీగా జరిగిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో జపాన్ ద్వయం జేపీ బే – లస్సే మాల్డే జోడీపై 15-21; 21-11; 21-14 తేడాతో నెగ్గి టైటిల్ రేసులో నిలిచారు.
నేడు జరిగే సెమీస్ పోరులో మలేషియా జోడీ ఆంగ్ యూ సిన్- టో యే ఈ లతో సాత్వి-చిరాగ్ జోడీ తలపడనుంది.