Friday, September 20, 2024
Homeస్పోర్ట్స్Korea Open: సాత్విక్- చిరాగ్ దే పురుషుల డబుల్స్ టైటిల్

Korea Open: సాత్విక్- చిరాగ్ దే పురుషుల డబుల్స్ టైటిల్

కొరియా ఓపెన్ -2023 పురుషుల డబుల్స్  టైటిల్ ను భారత జోడీ సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టిలు గెల్చుకున్నారు. నేడు జరిగిన  ఫైనల్ లో ఇండోనేషియా జంట ఫజర్ అల్ఫియన్- ముహమ్మద్ రియాన్  ద్వయం పై 17-21; 21-13; 21-14 తేడాతో విజయం సాధించి విజేతలుగా నిలిచారు. తొలి సెట్ కోల్పోయినా నిరాశ చెందకుండా ప్రత్యర్థులపై పైచేయి సాధించారు.  బి. డబ్ల్యూ ఎఫ్ వరల్డ్ టూర్ టోర్నమెంట్ లో  ఈ ఏడాది మూడో టైటిల్ కాగా మొత్తంగా ఏడు సార్లు ఈ జోడీ టైటిల్స్ సాధించారు.

ఈ ఏడాది మార్చిలో జరిగిన స్విస్ ఓపెన్, జూన్ మూడో వారంలో జరిగిన  ఇండోనేషియా ఓపెన్ టైటిల్ ను గెల్చుకున్న ఈ జోడీ నేటి విజయంతో   ఈ ఏడాది మూడో టైటిల్ సొంతం చేసుకుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్