Sunday, January 19, 2025
Homeసినిమాస‌త్య‌దేవ్ గాడ్సే రిలీజ్ డేట్ ఫిక్స్

స‌త్య‌దేవ్ గాడ్సే రిలీజ్ డేట్ ఫిక్స్

Godse Coming: జ్యోతిల‌క్ష్మి, బ్ల‌ఫ్ మాస్ట‌ర్, 47 డేస్, స్కైలాబ్, తిమ్మ‌ర‌సు.. ఇలా విభిన్న క‌థా చిత్రాల‌తో మెప్పిస్తున్న యువ క‌థానాయ‌కుడు స‌త్య‌దేవ్. హీరోగా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా న‌టిస్తూ.. మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్ర‌స్తుతం హీరోగా బిజీగా ఉన్నాడు. అయితే.. తాను చేసిన సినిమాల్లో బెస్ట్ వర్క్ అయినటువంటి బ్లఫ్ మాస్టర్ దర్శకుడు గోపి గణేష్ తో చేసిన‌ సినిమా గాడ్సే. బ్ల‌ఫ్ మాస్ట‌ర్ సినిమాతో ఎలాగైతే మంచి హార్డ్ హిట్టింగ్ డ్రామాతో వచ్చారో దీనిని కూడా అంతే మంచి కంటెంట్ తో తీసుకొస్తున్నారు.

ఈ సినిమా పై ఫ‌స్ట్ నుంచి క్యూరియాసిటీ ఏర్ప‌డింది. క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డిన ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ కి రెడీ అయ్యింది. ఇప్పుడు మేకర్స్ ఈ సినిమా తాలూకా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసేసారు. ఈ చిత్రాన్ని మే నెల 20న రిలీజ్ చేస్తున్నట్టు తెలియ‌చేశారు. మరి ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని సి.కళ్యాణ్ నిర్మించారు.

Also Read : మెగాస్టార్ చేతుల మీదుగా ‘గాడ్సే’ టీజ‌ర్‌

RELATED ARTICLES

Most Popular

న్యూస్