Saturday, January 18, 2025
Homeసినిమాజులై 30న వస్తున్న తిమ్మరుసు

జులై 30న వస్తున్న తిమ్మరుసు

యంగ్ హీరో సత్యదేవ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘తిమ్మరుసు’. ఈ చిత్రానికి ‘అసైన్మెంట్ వాలి’ అనేది ట్యాగ్ లైన్. కిర్రాక్ పార్టీ ఫేమ్ శరణ్ కొప్పిశెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ‘టాక్సీవాలా’ ఫేమ్ ప్రియాంక జువాల్కర్ హీరోయిన్ గా నటించింది. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ మరియు ఎస్ ఒరిజినల్స్ బ్యానర్స్ పై మహేష్ కోనేరు – సృజన్ ఎరబోలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సత్యదేవ్ లాయర్ పాత్ర పోషించారు. న్యాయాన్ని గెలిపించడానికి ఎంత దూరమైనా వెళ్లేలా ఈ పాత్ర ఉంటుంది.

ఈ సినిమాని సమ్మర్ లో మే 21న రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. కరోనా కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు లాక్ డౌన్ ఎత్తి వేయడం, థియేటర్లు ఓపెన్ చేసుకోవడానికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడంతో ‘తిమ్మరుసు’ ను జులై 30న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. థియేటర్ కి వెళ్లి సినిమా చూడడాన్ని ఇన్నాళ్లు మిస్ అయ్యాం. థియేటర్లు ఓపెన్ అయ్యాయి. ‘మీ అందర్నీ థియేటర్లో కలుసుకోబోతున్నందుకు సంతోషంగా ఉందని’ సత్యదేవ్ అన్నారు. మరి. విభిన్న కథా చిత్రాలతో ఆకట్టుకున్న సత్యదేవ్ తిమ్మరుసు సినిమాతో కూడా సక్సస్ సాధిస్తాడని ఆశిద్దాం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్