Sunday, September 8, 2024
HomeTrending Newsమతం మారిన దళితులను ఎస్సీల్లో చేర్చకపోవడం సబబే

మతం మారిన దళితులను ఎస్సీల్లో చేర్చకపోవడం సబబే

ఇస్లాం, క్రైస్తవ మతం స్వీకరించిన దళితులను షెడ్యూల్డ్‌ కులాల (ఎస్సీ) జాబితా నుంచి మినహాయించడాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంది. షెడ్యూల్‌ కులాలను గుర్తించడమనేది సామాజిక అసమానతలపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది. ఎస్సీలకు వర్తిస్తున్న ప్రయోజనాలను దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలు పొందలేరని పేర్కొంటూ సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. చారిత్రక ఆధారాల ప్రకారం దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలు వెనుకబాటుకు, సామాజిక అణచివేతకూ గురికాలేదని పేర్కొంది.

ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి స్పందనగా కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ ఈ అఫిడవిట్‌ సమర్పించింది. షెడ్యూల్డ్‌ కులాలకు సంబంధించిన 1950 రాజ్యాంగ ఉత్తర్వులు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా లేవని వివరించింది.  ‘అంటరానితనం అనే సామాజిక అణచివేత వ్యవస్థ వల్ల హిందూ సమాజంలోని కులాల్లో వెనుకబాటుతనం ఏర్పడింది. క్రైస్తవ, ఇస్లాం సమాజాల్లో ఇలాంటి వ్యవస్థ లేదు. చారిత్రక సమాచారం ప్రకారం చూసినా.. క్రైస్తవ, ఇస్లాం మతాల్లోని వర్గాల్లో సామాజిక వెనుకబాటుతనం, అణచివేత లేవు. హిందూ సమాజంలోని అణచివేత నుంచి బయటకు వచ్చేందుకే షెడ్యూల్‌ కులాల ప్రజలు మతం మారుతున్నా’రని కేంద్రం తన నివేదికలో పేర్కొంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్