Sunday, February 23, 2025
HomeTrending NewsChandrayan-3: తెలంగాణలో సాయంత్రం 6.30 వరకు స్కూల్స్ ఓపెన్

Chandrayan-3: తెలంగాణలో సాయంత్రం 6.30 వరకు స్కూల్స్ ఓపెన్

తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు (బుధవారం) సాయంత్రం 6.30 గంటల వరకు రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను నడపాలని నిర్ణయించింది.

ఈ మేరకు విద్యాశాఖ డీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ -3 ప్రాజెక్ట్‌లో భాగంగా విక్రమ్ ల్యాండర్ ఈ రోజు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో చంద్రుడిపై ల్యాండ్ కానుంది.

విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై దిగే అద్భుత ఘట్టాన్ని విద్యార్థులు నేరుగా చూడాలనే ఆలోచనతో ఈ రోజు స్కూళ్లను 6.30 వరకు నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అద్భుత ఘట్టాన్ని స్టూడెంట్స్ వీక్షించేందుకు స్కూళ్లలో ప్రత్యేక స్క్రీన్లను ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

దీంతో తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలు 6.30 వరకు నడవనున్నాయి.

జాబిల్లిపై అన్వేషణ కోసం ఇస్రో జూలై 14వ తేదీన శ్రీహరికోటలోని షార్ నుండి ప్రతిష్టాత్మంగా చంద్రయాన్-3 ప్రయోగం చేపట్టింది. నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-3 వివిధ దశల అనంతరం..ఈ రోజు సాయంత్రం 6.04 నిమిషాలకు చంద్రుడిపై అడుగుపెట్టనుంది.

జాబిల్లిపై చంద్రయాన్ -3లోని విక్రమ్ ల్యాండర్ దిగే అద్భుత ఘట్టం కోసం యావత్ ప్రపంచ దేశాలన్నీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్