Saturday, January 18, 2025
HomeTrending NewsBJP-TDP-Jana Sena Alliance: బిజెపికి డబుల్ డిజిట్ సీట్లు

BJP-TDP-Jana Sena Alliance: బిజెపికి డబుల్ డిజిట్ సీట్లు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి పది సీట్లకు పోటీ చేయనుంది. తెలుగుదేశం-బిజెపి-జనసేన కూటమి సీట్ల సర్దుబాటు పూర్తయ్యింది. తొలుత టిడిపి 145; జనసేన-బిజెపి కలిసి 30 అసెంబ్లీ… టిడిపి 17; బిజెపి-జనసేన 8 పార్లమెంట్ సీట్లలో పోటీ చేయాలని నిర్ణయించారు. కానీ నిన్న టిడిపి అధినేత చంద్రబాబు నివాసంలో కూటమి నేతల సమావేశం జరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బిజెపి తరఫున కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, ఎంపి వైజయంత్ పాండాలు ఈ భేటీలో పాల్గొన్నారు. దాదాపు 8 గంటలపాటు జరిగిన సమావేశంలో చివరకు టిడిపి 144; బిజెపి 10; జనసేన 21 అసెంబ్లీ స్థానాల్లో.. టిడిపి 17; బిజెపి 6; జనసేన 2 లోక్ సభ సీట్లకు పోటీ చేయాలని నిర్ణయించారు.  ఏయే సీట్లలో ఎవరెవరు పోటీ చేస్తారనేదానిపై నేడు నేతలు మరోసారి సమావేశమై ఖరారు చేయనున్నారు.

జనసేన మొదటగా 24 అసెంబ్లీ 3 పార్లమెంట్ సీట్లకు పోటీ చేస్తున్నట్లు పవన్ ప్రకటించినా… మరోసారి తన ఖాతాలోని కొన్ని సీట్లను బిజెపికి త్యాగం చేయాల్సి వచ్చింది. బిజెపికి 6 అసెంబ్లీ సీట్లు ఇస్తున్నట్లు వార్తలు వచ్చినా చివరకు… డబుల్ డిజిట్ కు చేరి 10 సీట్లలో ఆ పార్టీ బరిలోకి దిగబోతోంది. దీనిపై మూడు పార్టీలూ కలిసి ఓ ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్