Sunday, November 24, 2024
HomeTrending Newsది ఎలిఫెంట్ విష్పరర్స్: ఇండియాకు రెండో ఆస్కార్

ది ఎలిఫెంట్ విష్పరర్స్: ఇండియాకు రెండో ఆస్కార్

ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ స్కోరు విభాగంలో ఆస్కార్ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. దీనితో పాటు మరో ఆస్కార్ కూడా ఇండియాకు దక్కింది. బెస్ట్ షార్ట్ ఫిల్మ్ – డాక్యుమెంటరీ విభాగంలో  ‘ ద ఎలిఫెంట్ విష్పరెర్స్’ విజేతగా నిలిచింది. కార్తీకి గోన్సాల్వీస్, గునీత్ మోంగ లు ఈ అవార్డును అందుకున్నారు.

ముదుమలై నేషనల్ పార్క్ లో ఈ డాక్యుమెంటరీని చిత్రీకరించారు. బొమ్మన్, బెల్లీ అనే దంపతులు ‘రఘు’ పేరున్న ఓ అనాథ ఏనుగు పిల్లను పెంచుకుంటారు. వారి మధ్య జరిగే సన్నివేశాలతో రూపొందించిన ‘ ది ఎలిఫెంట్ విష్పరర్స్’ భావోద్వేగాలతో కూడుకుని ఉంటుంది. 2022లో నెట్ ఫ్లిక్స్ లో ఈ షార్ట్ ఫిల్మ్ విడుదలై ప్రజాదరణ పొందింది.

Also Read : చరిత్ర సృష్టించిన ఆర్ఆర్ఆర్: ‘నాటు నాటు’ కు ఆస్కార్

RELATED ARTICLES

Most Popular

న్యూస్