Sunday, January 19, 2025
Homeసినిమాథాయిలాండ్‌లో రామ్ పోతినేని ‘డబుల్ ఇస్మార్ట్‌’ రెండో షెడ్యూల్

థాయిలాండ్‌లో రామ్ పోతినేని ‘డబుల్ ఇస్మార్ట్‌’ రెండో షెడ్యూల్

రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘డబుల్ ఇస్మార్ట్‌’. ఈ చిత్రం షూటింగ్ కొద్ది రోజుల క్రితం ముంబైలో ఒక ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించడంతో ప్రారంభమైంది. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్న ఈ సినిమా కోసం రామ్ స్టైలిష్ మేకోవర్‌ అయ్యారు. విషు రెడ్డి సీఈవో.

ఈ చిత్రం రెండో షెడ్యూల్ థాయిలాండ్ లో ప్రారంభమైయింది. ఈ షెడ్యూల్లో రామ్, సంజయ్ దత్ పై  కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇటీవలే విడుదలైన సంజయ్ దత్ ఫస్ట్ లుక్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. తన నటీనటులను బెస్ట్ మాస్ అప్పీలింగ్‌ లో ప్రజంట్ చేయడం లో స్పెషలిస్ట్ అయిన పూరి జగన్నాథ్ ‘డబుల్ ఇస్మార్ట్‌’ లో సంజయ్ దత్‌ను మునుపెన్నడూ చూడని అవతార్‌లో చూపించనున్నారు. రామ్, సంజయ్ దత్‌లను తెరపై కలిసి చూడటం అభిమానులకు, సినీ ప్రియులకు ఎక్సయిటింగ్ గా ఉంటుంది. డబుల్ ఇస్మార్ట్  తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మార్చి 8, 2024న మహా శివరాత్రికి విడుదలౌతుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్