‘మహాసముద్రం’ రెండో సాంగ్ రిలీజ్ చేసిన రష్మిక

సిద్దార్థ్, శర్వానంద్ కాంబినేషన్‌లో రూపొందిన ‘మహా సముద్రం’ సినిమా ప్రమోషన్స్ ఫుల్ జోరు మీదున్నాయి. దసరా కానుక‌గా అక్టోబర్ 14న ఈ చిత్రం థియేటర్లో సందడి చేయబోతోంది. ‘ఆర్ ఎక్స్ 100’ తరువాత దర్శకుడు అజయ్ భూపతి విభిన్న కథాంశంతో ‘మహా సముద్రం’ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇటీవ‌ల ఈ చిత్రం నుండి విడుద‌లైన‌ మాస్ సాంగ్ `హే రంభ` పాట‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక తాజాగా రెండో పాట ‘చెప్పకే… చెప్పకే’ ఒక బ్రీజీ,  మరియు స్వీట్-సౌండింగ్ నంబర్ ను స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా విడుదల చేశారు.

ఈ లిరికల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పాట అదితి రావు హైదరి మీద చిత్రీక‌రించిన‌ప్ప‌టికీ ఈ లిరికల్ వీడియోలో సిద్దార్థ్, శర్వానంద్, అను ఇమాన్యుయెల్ కూడా కనిపిస్తున్నారు. త‌మ పక్కింటి కుర్రాడైన శర్వానంద్‌ను అదితి రావ్ హైదరి ఎంత‌గానో ప్రేమిస్తుంది. సీక్రెట్‌గా ఆమె శర్వానంద్‌ను ఫాలో అవుతూ.. ఓ ఊహా ప్రపంచంలో బ్ర‌తికేస్తూ ఉంటుంది. ఆ సమయంలోనే అను ఇమాన్యుయేల్ శర్వానంద్ జీవితంలోకి వస్తుంది. దాంతో అదితి సిద్దార్థ్ కు సన్నిహితంగా మారుతుంది.

ఈ పాటకు చైతన్య ప్రసాద్ అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. దీప్తి పార్థసారథి గాత్రం వినసొంపుగా ఉంది. ఇది కచ్చితంగా శ్రోతల హృదయాల్లో నిలిచిపోయే పాట అవుతుంది. ఇన్‌టెన్స్ ల‌వ్‌, యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సుంక‌ర రామ‌బ్ర‌హ్మం నిర్మిస్తున్నారు. అదితిరావు హైద‌రి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. రాజ్ తోట సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి ప్ర‌వీణ్ కె.ఎల్ ఎడిట‌ర్‌, కొల్లా అవినాష్ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌. ప్ర‌పంచ వ్యాప్తంగా అక్టోబ‌ర్ 14న ‘మ‌హా స‌ముద్రం’ విడుద‌ల‌వుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *