Sunday, February 23, 2025
HomeTrending Newsజేసీకి చేదు అనుభవం

జేసీకి చేదు అనుభవం

Insult to JC: ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో సీనియర్ రాజకీయ నేత, మంత్రిగా, ఏడు సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసిన మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డ్డికి నేడు చేదు అనుభవం ఎదురైంది. ప్రగతి భవన్ దగ్గర ఆయన్ను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు.

మంత్రి కేటీఆర్ ను కలిసేందుకు ప్రగతి భవన్ లోపలికి వెళ్లేందుకు అయన ప్రయత్నించగా అపాయింట్మెంట్ లేనిదే లోపలికి అనుమతించబోమని సెక్యూరిటీ సిబ్బంది స్పష్టం చేశారు. కాసేపు కారులో ఉంది అపాయింట్ మెంట్ కోసం అయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీనితో కాసేపు అక్కడ వెయిట్ చేసి వెనుదిరిగి వెళ్ళిపోయారు జేసీ.

RELATED ARTICLES

Most Popular

న్యూస్