Friday, March 29, 2024
Homeస్పోర్ట్స్CWG-2022:Badminton: ప్రీ క్వార్టర్స్ కు లక్ష్య సేన్, ఆకర్షి

CWG-2022:Badminton: ప్రీ క్వార్టర్స్ కు లక్ష్య సేన్, ఆకర్షి

కామన్ వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్ సింగిల్స్ లో భారత ఆటగాళ్ళు లక్ష్య సేన్, ఆకర్షి కాశ్యప్ కూడా ప్రీ క్వార్టర్స్ కు చేరుకున్నారు.

పురుషుల సింగిల్స్ లో లక్ష్య సేన్ 21-4;21-5 తేడాతో సెయింట్ హెలెనా ద్వీపానికి చెందిన ఆటగాడు సమీద్ పై గెలుపొందాడు.

మహిళల సింగిల్స్ లో ఆకర్షి కాశ్యప్… పాక్ క్రీడాకారిణి షాహాజ్ పై విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన తొలి సెట్ ను 22-20తో ఆకర్షి గెల్చుకుంది. రెండో సెట్ 8-1తో కాశ్యప్ ఆధిక్యంలో ఉన్న సమయంలో షాహాజ్ రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగింది.

అంతకుముందు జరిగిన సింగిల్స్ విభాగంలో పివి సింధు, కిడాంబి శ్రీకాంత్ లు తోలు రౌండ్ లో ప్రత్యర్థులపై విజయం సాధించి ప్రీక్వర్తెర్స్ కు చేరుకున్నారు.

నేడు ఈ నలుగురూ తమ ప్రీ క్వార్టర్ మ్యాచ్ లు ఆడనున్నారు.

Also Read : Boxing : సెమీస్ లో నిఖత్ జరీన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్