మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ శ్రీమతి గుమ్మడి కూతుహలమ్మ ఈ రోజు ఉదయం కన్ను మూశారు. ఆమె వయస్సు 73 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె పరిస్థితి విషమించి నేడు మరణించారు. 1980లో చిత్తూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ గా రాజకీయ జీవితాన్ని ఆరంభించిన ఆమె ఐదుసార్లు చిత్తూరు జిల్లానుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1985, 1989, 1999, 2004, 2009 ఎన్నికల్లో ఆమె గెలుపొందారు. ఇందులో మూడుసార్లు వేపంజరి (ఎస్సీ), ఒకసారి గంగాధర నెల్లూరు (ఎస్సీ) నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2007 నుంచి 2009 వరకూ ఆమె ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా పనిచేశారు.
ఆంధ్ర ప్రదేశ్ విభజన అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరిన కుతూహలమ్మ 2014 ఎన్నికల్లో గంగాధర నెల్లూరు నుంచి పోటీ చేసి ప్రస్తుత ఏపీ డిప్యూటీ సిఎం కె. నారాయణ స్వామి చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి రాజకీయాలకు ఆమె దూరంగా ఉంటున్నారు.