Friday, April 19, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంబ్రిటన్ లో పాడు సంస్కృతి

బ్రిటన్ లో పాడు సంస్కృతి

Students- Sex Worker concept:
ఈ పోస్ట్ పెడుతున్నందుకు క్షమించాలి. నిజం… అది ఎంత చేదుగావున్నా తెలుసుకోవాలి కదా?
మనం కళ్ళు మూసుకొని అంతా సవ్యంగా వుందనుకుంటే సరిపోతుందా? నిజం తెలుసుకోవాలంటే చదవండి. అదే సమయంలో సున్నిత మనస్కులు దీన్ని చదవొద్దు. వదిలెయ్యండి…

వ్యభిచారం! ఒకప్పుడు ఈ పదాన్ని వాడేవారు. తరువాత రోజుల్లో వ్యభిచారి అనే పదాన్ని సెక్స్ వర్కర్ అనే పదంతో రీప్లేస్ చేశారు.
సెక్స్ వర్కర్ అంటే ఎవరు? బతకడానికి మరే ఇతర మార్గం లేకుండా ఒళ్ళమ్ముకొనేవారు…కదా? సెక్స్ వర్కర్ లు అందరూ పొట్టగడవని వారే. సెక్స్ సర్వీస్ చేసి సంపాదించి కుటుంబాన్ని పోషించే వారే. ఇది ఇప్పటిదాకా తెలిసింది.

ప్రపంచం మారుతోంది. మార్పులో మంచి చెడు రెండూ వున్నాయి. విలాసవంతమైన జీవనం గడపడానికి, లేదా ఉన్నత చదువులు పూర్తి చేసుకోవడానికి అంటే దాని కోసం తగినంత ఫీజు కట్టడానికి అవసరమైన డబ్బు సంపాదించడానికి యూనివర్సిటీ విద్యార్థులు సెక్స్ ను ఒక వృత్తిగా ఎంచుకొంటే?

ఎవరో ఎక్కడో ఒకరో ఇద్దరో చేస్తే… అది రేర్… అంటే అరుదుగా జరిగే విషయం… వ్యక్తి పైత్యం అనుకోవచ్చు. అలాంటి ఒకటి రెండు ఘటనల్ని వదిలేయొచ్చు. కానీ వందల్లో, వేలల్లో జరుగుతుంటే? అది ఒక ట్రెండ్ గా మారుతుంటే? అప్పుడు దాన్ని పట్టించుకోవాలి. అవునా ? కాదా ?

నమ్మలేని విషయాలు .. అయ్యో ఇది తప్పైతే బాగుండు… అనుకొనే విషయాలు ఇవిగో... సున్నిత మనస్కులు ఇప్పటికైనా పోస్ట్ చదవడం ఆపెయ్యండి.

⦿ బ్రిటన్ లో మొత్తం విద్యార్థుల సంఖ్య 24 లక్షలు. ఇందులో ఒక లక్ష మంది సెక్స్ సర్వీసెస్ చేసి డబ్బు గడిస్తున్నారు.

⦿ డబ్బు అవసరం అయినప్పుడు తాము దీన్ని చేస్తామని మరో లక్ష మంది విద్యార్థులు చెబుతున్నారు. అంటే ప్రతి పదిమందిలో ఒకరు దీనికి రెడీ.

⦿ వీరిలో సింహ భాగం యూనివర్సిటీ విద్యార్థులే. అందునా ఎక్కువ మంది అమ్మాయిలే.

Sex Worker Concept

⦿ షుగర్ డాడీ… అంటే డబ్బున్న ఒక మధ్య వయస్కడు ఒక అమ్మాయిని ఎంచుకొని స్పాన్సర్ చేస్తాడు. ఆమె అతనికి ప్రియురాలిగా వ్యవహరిస్తుంది. టూర్లకు వెళ్లడం లాంటివి చేస్తారు. వారి మధ్య సెక్స్ జరుగుతుంది. ఇందుకు ప్రతిఫలంగా ఆ వ్యక్తి సదరు అమ్మాయి చదువు, దుస్తులు, ఇంటి అద్దె లేదా హాస్టల్ ఖర్చులు లాంటివి భరిస్తాడు . దీనికోసం షుగర్ డాడీ సైట్స్ వున్నాయి. ఇందులో షుగర్ డాడీగా వ్యవహరించాలని అనుకున్నవారు ప్రకటన ఇస్తారు. అమ్మాయిలు కూడా ప్రకటనలు ఇస్తారు. ఇది కొత్త కాన్సెప్ట్ ఏమీ కాదు. ఇప్పటి బ్రిటిష్ ప్రధాని కూడా నిన్నటి షుగర్ డాడీ. దీనికి సంబంధించి పుంఖానుపుంఖాల డేటాను ఇటీవల డిలీట్ చేశారు. షుగర్ డాడీ కాన్సెప్ట్ ఇప్పుడు బాగా ఎక్కువవుతోంది .

⦿ వెబ్ కాం సెక్స్, పోర్న్ ఫిలిమ్స్ లో నటించడం, సెక్స్ వర్కర్ గా వ్యవహరించడం, సెక్స్ మోడలింగ్.. ఇలాంటివి మిగతా పద్ధతులు.

⦿ యూనివర్సిటీ లు ఇలాంటి వాటిని ఇండైరెక్ట్ గా ప్రోత్సహిస్తున్నాయి. ఇదే అన్నిటికన్నా ఆందోళనకరం. ఒక యూనివర్సిటీలో చదవాలంటే హాస్టల్ ఖర్చులతో కలుపుకొని నెలలు ఎనిమిది వందల పౌండ్స్ ఖర్చు అవుతుంది. అంటే సుమారుగా నెలకు ఎనభై వేలు. ఇంత డబ్బు కావాలంటే ఇదే సరైన మార్గం అని ఎక్కువ మంది ఇదే దారిన వెళుతున్నారు. యూనివర్సిటీ ప్రొఫసర్ లు ఇదేమీ తప్పు కాదన్నట్టు విద్యార్థులతో చెబుతూ వారిని ప్రోత్సహిస్తున్నారు. జూనియర్ విద్యార్ధులను ఇలాంటి విషయాల్లో ట్రైన్ చేయడానికి కొన్ని విద్యార్ధి సంఘాలు కార్యక్రమాలను కూడా చేపడుతున్నాయి.

⦿ గతంలో విద్యార్థులు హోటల్స్ లాంటి వాటిలో సర్వర్ లు గా పనిచేసి డబ్బు సంపాదించేవారు. కరోనా పాండమిక్ వల్ల హాస్పిటాలిటీ ఇండస్ట్రీ దెబ్బతింది. దీనితో సెక్స్ సర్వీస్ బాగా పుంజుకొంది. రూమ్ లో కూర్చొని వెబ్ కాంలో సెక్స్ చాటింగ్, న్యూడ్ మోడలింగ్, ఫోటోలు షేర్ చేసుకోవడం…. ఈ విధంగా డబ్బు సంపాదించడం తేలిక అనే అభిప్రాయం ప్రబలుతోంది. ఒకరిని చూసి మరొకరు ప్రేరణ పొందుతున్నారు.

⦿ ఫైవ్ స్టార్ హోటల్స్, ఫైవ్ స్టార్ క్రూజ్ లాంటి వాటిలో గడిపే అవకాశం, పెద్ద ఎత్తున ఆస్తులు సంపాదించే అవకాశం ఉండడంతో ఎక్కువ మంది దీని వైపు ఆకర్షితులవుతున్నారు. ఆసియా ఖండానికి చెందిన అమ్మాయిలు కూడా ఆకర్షితులు అవుతున్నారు. కానీ ప్రస్తుతానికి వీరి సంఖ్య తక్కువ.

⦿ ఒక అడుగు ముందుకేసి లీసెస్టర్ యూనివర్సిటీ బాహాటంగానే స్టూడెంట్ సెక్స్ టూల్ కిట్ ను తీసుకొచ్చింది. సెక్స్ వర్క్ లో పాల్గొనే విద్యార్థులకు సూచనలు, సలహాలు ఇస్తోంది. అంతేకాకుండా ఇలాంటి విద్యార్థులకు దేశం లోపల సపోర్ట్ సర్వీసెస్ ఇష్టమంటోంది. సారీ! నిజం నిష్ఠూరంగా ఉంటుంది. అంటే తార్పుడు గాడిలాగా యూనివర్సిటీ వ్యవహరిస్తోంది. “ఇదేమీ తప్పుకాదు. ఎంతోమంది విద్యార్థులు ఇదే దారిలో వున్నారు. వారు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారి సమస్యలను తీర్చడమే ఈ టూల్ కిట్ లక్ష్యం” అని చెప్పుకొంటోంది . న్యూ castle విశ్వవిద్యాలయం కూడా స్టుడెంట్ సెక్స్ వర్కర్స్ కు సంబంధించి ఒక విధానాన్ని ప్రచురించింది. నమ్మండి… నమ్మకపోండి… ప్రపంచ ప్రఖ్యాతి పొందిన కేంబ్రిడ్జి యూనివర్సిటీ కూడా గత సంవత్సరం దీనికి సంబంధించి కరపత్రాలను పంచింది. సెక్స్ వర్క్ ను సమర్ధించేలా ఇది వుంది. గోల్డ్ స్మిత్, ఎడిన్బర్గ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్స్ ‘స్టూడెంట్ సెక్స్ వర్క్ అనేది మిగతా వృతుల్లాగే ఒక వృత్తి, దీన్ని తప్పుపడితే సహించం’ అని ప్రకటించాయి. సుసెక్స్ ఇంకా బ్రింగ్ టన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్స్ ఫ్రెషర్స్ పార్టీ కార్యక్రమాల్లో సెక్స్ వర్కర్ స్టుడెంట్స్ కోసం ప్రత్యేక స్టాల్ల్స్ ఏర్పాటు చేశాయి.

ఇంకా చాలా వుంది… చాలు… ఈ పోస్ట్ పెట్టినందుకు నాపై నాకే అసహ్యం వేస్తోంది… సారీ…

-వాసిరెడ్డి  అమరనాథ్

Also Read : మాయమైపోతున్నడమ్మా మనిషన్న వాడు

RELATED ARTICLES

Most Popular

న్యూస్