Sunday, January 19, 2025
Homeసినిమా'శాకుంతలం' ట్రైలర్ కి ముహుర్తం ఫిక్స్

‘శాకుంతలం’ ట్రైలర్ కి ముహుర్తం ఫిక్స్

సమంత టైటిల్ రోల్ లో గుణశేఖర్ తెరకెక్కించిన భారీ చిత్రం శాకుంతలం. ఇందులో మలయాళ నటుడు దేవ్ మోహన్, దుశ్యంతుడిగా నటిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ
మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ మూవీని గుణా టీమ్ వర్క్స్ బ్యానర్ పై నీలిమ గుణ భారీ స్థాయిలో నిర్మిస్తుండగా టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. శకుంతల, దుష్యంతుల కథగా రూపొందిన ఈ మూవీని దర్శకుడు గుణశేఖర్ ఒక ఆకట్టుకునే విజువల్ వండర్ గా అద్భుతంగా తెరకెక్కించారని అంటోంది చిత్ర యూనిట్. ఇటీవల రిలీజ్ చేసిన ఈ మూవీ పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ లభించింది.

అయితే మ్యాటర్ ఏమిటంటే… శాకుంతలం మూవీ థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నట్లుగా గుణశేఖర్ సర్ప్రైజింగ్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. ఇంతకీ ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే.. శాకుంతలం ట్రైలర్ ని జనవరి 9న మధ్యాహ్నం 12 గం. ల 6 ని. లకు రిలీజ్ చేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు. నిజానికి ఒక్కసారిగా తమ హీరోయిన్ నటిస్తున్న మూవీ యొక్క ట్రైలర్ అనౌన్స్ మెంట్ రావడంతో సమంత ఫ్యాన్స్ సోషల్ మీడియా మాధ్యమాల్లో ఆనందం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ మూవీని ఫిబ్రవరి 17 న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్