Sunday, January 19, 2025
HomeసినిమాSamantha: కుంచెతో బొమ్మ గీసినట్లు... 'శాకుంతలం' ట్రైలర్

Samantha: కుంచెతో బొమ్మ గీసినట్లు… ‘శాకుంతలం’ ట్రైలర్

అద్భుత‌మైన సంభాష‌ణ‌లు.. అంత‌కు మించి క‌ళ్లు ఆనందంతో విప్పారే స‌న్నివేశాలు ….ఇవ‌న్నీ క‌ల‌బోసిన చిత్ర‌మే ‘శాకుంతలం’ అని ట్రైల‌ర్‌ను చూస్తుంటే అర్థ‌మ‌వుతుంది. ప్ర‌తి స‌న్నివేశాన్ని కుంచెతో బొమ్మ గీసిన‌ట్లు అద్భుతంగా తెర‌కెక్కించారు ఎపిక్ ఫిల్మ్ మేక‌ర్ గుణ శేఖ‌ర్‌. మహాభార‌తంలోని అద్భుత‌మైన ప్రేమ క‌థగా మ‌నం చెప్పుకునే దుష్యంత‌, శ‌కుంత‌ల ప్రేమ‌గాథ‌ను మ‌హా క‌వి కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం కావ్యంగా రాశారు. దాన్ని ఆధారంగా చేసుకుని సిల్వర్ స్క్రీన్‌ పై గుణ శేఖ‌ర్ రూపొందించిన విజువ‌ల్ వండ‌ర్ ‘శాకుంతలం’. పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రం ఏప్రిల్ 14న తెలుగు, త‌మిళం, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. ఇప్ప‌టికే సినిమా పై భారీ అంచ‌నాలున్నాయి. దీన్ని మరో మెట్టుకి తీసుకెళ్లేలా ట్రైల‌ర్‌ను ద‌ర్శ‌క నిర్మాత‌లు విడుద‌ల చేశారు.

శ‌కుంత‌లగా స‌మంత అందం, అమాయ‌క‌త్వం క‌ల‌గ‌లిపిన న‌ట‌న‌, దుష్యంత మ‌హారాజుగా దేవ్ మోహ‌న్ లుక్‌.. వారి మ‌ధ్య ప్రేమ స‌న్నివేశాలు, భావోద్వేగ ప్ర‌యాణం ఎంత హృద్యంగా ఉంటుంద‌నేది ఈ ట్రైల‌ర్‌లో మ‌రోసారి చ‌క్క‌గా చూపించారు. అలాగే యాక్ష‌న్ స‌న్నివేశాలు కూడా వావ్ అనిపించేలా ఉన్నాయి. దుర్వాస మ‌హామునిగా మోహ‌న్ బాబు.. చిన్న‌నాటి భ‌ర‌తుడి పాత్ర‌లో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ ఇలా ప్ర‌తీ అంశం ప్రేక్ష‌కుల‌ను క‌ట్టి ప‌డేస్తుంది. సమంత, దేవ్ మోహన్ నటించిన పౌరాణిక ప్రణయ గాథ ‘శాకుంతలం’. శ్రీ వెంకటేశ్వ‌ర‌ క్రియేష‌న్స్, దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో గుణ టీమ్ వ‌ర్క్స్ బ్యానర్‌ పై నీలిమ గుణ ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మించారు. 3D టెక్నాల‌జీతో విజువ‌ల్ వండ‌ర్‌గా తెలుగు, హిందీ, త‌మిళ‌, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల్లో శాకుంత‌లం ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నుంది.
ఈ  చిత్రానికి సాయి మాధ‌వ్ బుర్రా సంభాష‌ణ‌లు అందించారు. శేఖ‌ర్ వి.జోసెఫ్ సినిమాటోగ్ర‌ఫీ, ప్ర‌వీణ్ పూడి ఎడిట‌ర్‌గా పని చేశారు. విజువ‌ల్‌గానే కాకుండా మ్యూజికల్‌గానూ ఆడియెన్స్‌కు ఆమేజింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వ‌టానికి రీ రికార్డింగ్‌ను బుడాపెస్ట్‌, హంగేరిలోని సింఫ‌నీ టెక్నీషియ‌న్స్ వ‌ర్క్ చేయ‌టం విశేషం. మొత్తానికి ట్రైలర్ ఈ సినిమా పై అంచనాలను పెంచేసింది. మరి.. శాకుంతలం ఏ స్థాయి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.

Also Read :  Dil Raju: ‘శాకుంతలం’.. అదే పెద్ద ఛాలెంజ్‌ – దిల్ రాజు

RELATED ARTICLES

Most Popular

న్యూస్