Sunday, January 19, 2025
HomeసినిమాJawan : బాలీవుడ్ లో.. సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన 'జవాన్'

Jawan : బాలీవుడ్ లో.. సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన ‘జవాన్’

షారుఖ్ ఖాన్, అట్లీ కాంబినేషన్లో రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ ‘జవాన్’. ఇందులో షారుఖ్ కు జంటగా నయనతార నటించగా, గెస్ట్ రోల్ లో దీపికా పడుకునే నటించింది. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన జవాన్ ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ సొంతం చేసుకుంది. నార్త్ లోనే కాకుండా సౌత్ లో కూడా మంచి కలెక్షన్స్ రాబట్టడం విశేషం. ఈ మూవీ రోజురోజుకు కలెక్షన్స్ పెంచుకుంటూ బాక్సాఫీస్ దగ్గర దూసుకెళుతుంది. 900 కోట్లు దాటి 1000 కోట్ల దిశగా పరుగులు పెడుతుంది.

అయితే.. బాలీవుడ్ లో బాహుబలి 2 చిత్రం 34 రోజుల్లో 500 కోట్లు క్లబ్ లో చేరింది. ఇక పఠాన్ మూవీ 28 రోజుల్లో 500 కోట్ల క్లబ్ లో చేరింది. గదర్ 2 చిత్రం 24 రోజుల్లో 500 కోట్ల క్లబ్ లో చేరింది. ఇప్పుడు జవాన్ చిత్రం 18 రోజుల్లోనే 500 కోట్ల క్లబ్ లో చేరి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం ఇంతటి విజయం సాధించడానికి యువ సంగీత సంచలనం అనిరుథ్ కూడా ఓ కారణం అని చెప్పచ్చు. ఇప్పటి వరకు షారుఖ్ చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఈ సినిమా ఉండడం.. ఫుల్ మాస్ ఉండడంతో ఆడియన్స్ కి బాగా నచ్చేసింది.

జవాన్ ఇచ్చిన కిక్ తో షారుఖ్, అట్లీ ఈ చిత్రానికి సీక్వెల్ కూడా చేయాలి అనుకుంటున్నారట. దీనిని బట్టి ఈ సినిమా ఎంద పెద్ద సక్సెస్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. అలాగే అట్లీ వెంటనే జవాన్ సీక్వెల్ చేస్తాడా..? వేరే హీరోతో సినిమా చేస్తాడా..? అనేది ఆసక్తిగా మారింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్