Sunday, January 19, 2025
Homeసినిమాజనవరిలో రానున్న ష‌క‌ల‌క శంక‌ర్ ‘ధ‌ర్మ‌స్థ‌లి’

జనవరిలో రానున్న ష‌క‌ల‌క శంక‌ర్ ‘ధ‌ర్మ‌స్థ‌లి’

కమెడియ‌న్ గా, కామెడి హీరోగా ఎన్నో చిత్రాల్లో ప్రేక్ష‌కుల్ని అల‌రించిన ష‌క‌ల‌క శంక‌ర్ హీరోగా ఒక బాధ్యతాయుత‌మైన మంచి పాత్ర‌లో క‌నిపిస్తున్న చిత్రం ‘ధ‌ర్మ‌స్థ‌లి’. రొచిశ్రీ మూవీస్ బ్యాన‌ర్ లో ప్ర‌ముఖ నిర్మాత ఎం ఆర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మాస్ క‌మ‌ర్షియ‌ల్ విలువ‌ల తెలిసిన ర‌మ‌ణ మోగిలి ద‌ర్శ‌కుడు. పావ‌ని హీరోయిన్ గా శంక‌ర్ కి జోడిగా న‌టిస్తుంది. వినోద్ యాజ‌మాన్య సంగీతాన్ని అందిస్తున్నారు. ధ‌ర్మ‌స్థ‌లి టైటిల్ వెన‌క క‌థ స‌మాజంలో జ‌రిగే విషం లాంటి ఒక విష‌యాన్ని అంద‌రికి అర్ధ‌మ‌య్యేలా  ర‌మ‌ణ మోగిలి తెర‌కెక్కిస్తున్నారు. ఓ వైపు ప్రేక్షకులను ఎంట‌ర్‌టైన్ చేస్తూనే మరోవైపు చైతన్య పరిచేలా సినిమా వుంటుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని జనవరిలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

ర‌మ‌ణ మోగిలి మాట్లాడుతూ “ష‌క‌ల‌క శంక‌ర్ తో ఇప్ప‌టివ‌ర‌కూ ఇలాంటి చిత్రాన్ని ఇలాంటి కాన్సెప్ట్ ని ఎవ‌రూ తెర‌కెక్కించ‌లేదు. ఆయ‌న‌లో వున్న కామెడి టైమింగ్ చూసిన వారికి ఆయ‌న‌లో వున్న ఇంటెన్సిటి కూడా ఈ చిత్రం ద్వారా అర్ధమ‌వుతుంది. ప్ర‌తి రోజు మ‌న జీవితాల‌తో ముడిప‌డిన ఓ విష‌యాన్ని, అలాగే మ‌న జీవితాల‌తో ఆడుకుంటున్న అంశాన్ని ఆయ‌న పాత్ర ద్వారా తెలియ‌జేస్తున్నాం. ఆయ‌న‌లో వున్న కామెడి టైమింగ్ మిస్ కాకుండా ఇంటెన్సిటిని తెర పైకి తీసువ‌స్తున్నాం. శంక‌ర్ కి జోడి పావ‌ని న‌టిస్తున్నారు. ఈ టైటిల్ ని ఎనౌన్స్ చేయ‌గానే భారీ బ‌డ్జెట్ చిత్రాల‌కి వ‌చ్చిన రెస్పాన్స్ రావ‌టం విశేషం. మ‌రిన్ని వివ‌రాలు అతి త్వ‌ర‌లో తెలియ‌జేస్తాం” అని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్