హైదరాబాద్ ని విశ్వనగరంగా మార్చాలన్న తెలంగాణ ప్రభుత్వ పట్టుదలకి మరో ఉత్తమ ఉదాహరణ ఎయిర్ పోర్ట్ మెట్రో. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని 100ఏండ్లకు సరిపడేలా దీర్ఘకాలిక ప్రణాళికలు రచించాలన్న సీఎం కేసీఆర్ సూచనా మేరకు.. తాజాగా శంషాబాద్ మెట్రోలో స్వల్ప మార్పులు చేసేవిధంగా అధికారులు ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగా రాయదుర్గం నుండి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు రూపొందిస్తున్న మెట్రోని మరింత పొడిగించే ప్రణాళికలని రచిస్తున్నారు. జంట నగరాలు అన్ని వైపులా విస్తరించే అవకాశం ఉండడంతో సౌత్ జోన్ ప్రాంతమైన తుక్కుగూడ ఓఆర్‌ఆర్ దాకా మెట్రోని పొడిగించేలా అధికారులు ప్రణాళికలు చేస్తున్నారు.
ప్రతిష్టాత్మక హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లైన్‌కు పొడిగింపుగా శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా తుక్కుగూడ ఓఆర్‌ఆర్ (ఔటర్ రింగ్ రోడ్డు) ఇంటర్‌చేంజ్ వరకు మెట్రో లైన్ నిర్మాణంపై అధ్యయనం చేయనున్నారు. హార్డ్‌వేర్ పార్క్, ఈ-సిటీ, రంగారెడ్డి కలెక్టరేట్, ఫార్మసీ, అమెజాన్ డేటా సెంటర్ వంటి సంస్థలు.. శంషాబాద్, తుక్కుగూడ, మహేశ్వరం, ఆదిభట్ల వంటి సౌత్ జోన్‌లో ఉన్నాయి. దాంతో ఈ ప్రాంతాలు అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుండటంతో.. నగరం నుంచి మెట్రో మార్గాన్ని రూపొందించడం ద్వారా భవిష్యత్ ప్రజా రవాణా అవసరాలను తీర్చే ప్రాజెక్టుగా మెట్రో మారనుంది.
Also Read : ఎయిర్‌పోర్టు మెట్రో ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ భూమిపూజ