శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్ తో భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. మరో వైపు ‘ఇండియన్ 2’ కూడా చేస్తున్నారు. ఒకేసారి చరణ్ తో ఓ సినిమా, కమల్ హాసన్ తో చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు శంకర్. అయితే.. ఈ రెండు సినిమాలు పూర్తైన తర్వాత శంకర్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ క్రేజీ, భారీ మల్టీస్టారర్ గురించి కోలీవుడ్ లో వార్తలు రావడం హాట్ టాపిక్ అయ్యింది.
ఈ సినిమా అంతా అండర్ వాటర్ లో నడిచే సైన్స్ ఫిక్షన్ ఫిలిం అని తెలుస్తోంది. ఇక ఈ సినిమా బడ్జెట్ 900 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. అయితే.. ఇంత డబ్బు పెట్టడానికి రెండు పెద్ద ప్రోడక్షన్ హౌస్ లు ముందుకు వచ్చినట్లు వార్తలు బయటకు వచ్చాయి. ఇంతకీ.. ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ లో నటించే హీరోలు ఎవరంటే.. విజయ్, షారుఖ్ ఖాన్. ఈ వార్త బాలీవుడ్ కి కూడా వెళ్లింది. అక్కడ కూడా హాట్ టాపిక్ అయ్యింది. ఇటీవల విజయ్ నటించిన వారసుడు చిత్రం తెలుగు, తమిళ్ లో విడుదలై పెద్ద విజయం సాధించింది. మూడు వందల కోట్లకు పైగా కలెక్ట్ చేసింది.
ఇక షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ పఠాన్. ఈ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకెళుతుంది. 1000 కోట్ల దిశగా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఇక వీరిద్దరి కాంబో సినిమా వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ లో సినిమా ఉంటుందని చెప్పచ్చు. హీరో విజయ్ ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమా తీయకపోయినా… ఆ రేంజ్ స్థాయి ఉంది. ఇక బాలీవుడ్ కు సరైనా హిట్ లేక అల్లాడిపోతున్న టైంలో పఠాన్ గా షారుక్ వచ్చి.. కోట్లు కొల్లగొడుతున్నాడు. ఇప్పుడు ఈ హీరోలు కలిసి.. శంకర్ దర్శకత్వంలో.. భారీ బడ్జెట్ మూవీ తీస్తే.. బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయమని అంటున్నారు. మరి.. ప్రచారంలో ఉన్నట్టుగా ఈ క్రేజీ కాంబో సెట్ అవుతుందేమో చూడాలి.
Also Read: చరణ్, శంకర్ మూవీ లేటెస్ట్ అప్ డేట్ ఏంటి..?