Sunday, January 19, 2025
Homeసినిమాఇండియ‌న్ 2 రీస్టార్ట్ ?

ఇండియ‌న్ 2 రీస్టార్ట్ ?

గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్.. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో ఓ భారీ పాన్ ఇండియా మూవీని తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ చ‌ర‌ణ్ స‌ర‌స‌న న‌టిస్తుంది. దాదాపు అర‌వై శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. శంక‌ర్ గ‌త చిత్రాల‌తో పోలిస్తే.. చాలా ఫాస్ట్ గా సినిమాలు చేస్తున్నాడు అనుకుంటే.. ఇప్పుడు ఫిలిం ఛాంబ‌ర్ నిర్ణ‌యంతో షూటింగ్ ఆపేయాల్సి వ‌చ్చింది.

అయితే.. డైరెక్ట‌ర్ శంకర్ ఇండియన్ 2 షూటింగ్ స్టార్ట్ చేయ‌డానికి రెడీ అవుతున్నాడు. దీని కారణంగా రామ్ చరణ్ షూటింగ్ ని ఆపేశారంటూ కథనాలొచ్చాయి. ఇండియన్ 2 సెట్స్ కి వెళ్లబోతున్నానంటూ అందాల చందమామ కాజల్ అగర్వాల్ తన రీఎంట్రీ గురించి ప్రస్థావిస్తూ కాల్షీట్ల వివరాల్ని వెల్లడించడంతో ఆకస్మికంగా చరణ్ ఫ్యాన్స్ లో చాలా డౌట్స్ స్టార్ట్ అయ్యాయి.

శంకర్ ఇండియ‌న్ 2 సెట్స్ కి వెళితే.. ఇక చర‌ణ్‌ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం చాలా కాలం పాటు హోల్డ్ లో పడిపోయినట్టేనని అంతా టెన్షన్ కి గురయ్యారు. కానీ ఇది నిజమా? అంటే కానేకాదని తెలిసింది. శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్ తో సినిమాకి చిన్నపాటి బ్రేక్ ఇస్తాడు అంతే. కమల్ హాసన్ తో ఇండియన్ 2 ని తిరిగి ప్రారంభిస్తాడు. కానీ దానిని పూర్తి చేయడు. ప్రస్తుతం తెలుగు సినిమా షూటింగ్ లు హోల్డ్ లో ఉన్నందున ఇండియన్  2 తో ముందుకు వెళ్లి 10 నుండి 12 రోజుల పాటు షూటింగ్ చేయాలని శంకర్ నిర్ణయించుకున్నారని తెలిసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్