Sunday, January 19, 2025
Homeసినిమాశర్వానంద్ ఇక రంగంలోకి దిగాల్సిందే! 

శర్వానంద్ ఇక రంగంలోకి దిగాల్సిందే! 

తెలుగులో యంగ్ హీరోలు ఒకరిని మించిన దూకుడు ఒకరు చూపిస్తూ వెళుతున్నారు. ఫ్లాప్ వచ్చినా .. హిట్ వచ్చినా ఆ తరువాత ప్రాజెక్టు విషయంలో ఆలస్యం చేయడం లేదు. కుదిరితే క్రేజ్ ఉన్న డైరెక్టర్ .. లేదంటే కొత్త డైరెక్టర్ అన్నట్టుగా చకచకా ప్రాజెక్టులను సెట్ చేసుకుంటున్నారు. ఇక ఓటీటీలు వచ్చిన తరువాత ఓ మాదిరి నిర్మాతలు కూడా కాస్త యాక్టివ్ గానే ఉంటున్నారు. సరైన కంటెంట్ అనిపిస్తే సెట్స్ పైకి వెళుతున్నారు.

నాని .. నిఖిల్ .. నాగశౌర్య వరుస సినిమాలు చేస్తూ రేస్ లో ఏ మాత్రం తగ్గకుండా చూసుకుంటున్నారు. అయితే శర్వానంద్ మాత్రం కాస్త నిదానంగానే .. నింపాదిగానే ఉంటున్నాడు. ఇక్కడ నాని తరువాత ఆ స్థాయి నటుడిగా శర్వానంద్ కి క్రేజ్ ఉండేది. నాని తరువాత వైవిధ్యభరితమైన కథలను ఎంచుకోవడంలో శర్వానంద్ పేరు వినిపించేది. అలాంటి ఆయన చాలా కాలంగా వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతూ వచ్చాడు.

శర్వా చేసిన ‘ఒకే ఒక జీవితం’ కంటెంట్ పరంగా మంచి మార్కులనే కొట్టేసింది. కాకపోతే శర్వానంద్ స్థాయి హిట్ కాదనే టాక్ వచ్చింది. సరైన కథల కోసం ఇక్కడే శర్వానంద్ గ్యాప్ తీసుకున్నాడు .. రీసెంటుగా పెళ్లి చేసుకున్నాడు. ఇక శర్వానంద్ మళ్లీ రంగంలోకి దిగిపోవలసిందే. తన స్థానాన్ని కాపాడుకోవడానికి పరుగు మొదలుపెట్టవలసిందే. ఎందుకంటే ఇప్పుడు కొత్త హీరోల జోరు కూడా పెరుగుతూ వస్తోంది. వాళ్లతో సినిమాలు చేయడానికి పెద్ద బ్యానర్లు కూడా ఉత్సాహాన్ని చూపుతున్నాయి. అందువలన శర్వానంద్ ఇక కథలపై దృష్టి పెట్టవలసిందే .. స్పీడ్ పెంచవలసిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్