టీమిండియాతో మూడు టి 20లు, మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు సౌతాఫ్రికా జట్టు ఈ నెలలో ఇండియాలో పర్యటిస్తోంది. దీనికి ముందే ఆస్ట్రేలియా కూడా ఇండియాలో పర్యటించి మూడు టి-20 ల సిరీస్ ఆడబోతోంది. సెప్టెంబర్ 20,23,25 తేదీల్లో మొహాలీ, నాగ పూర్, హైదరాబాద్ ల్లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ లు జరగనున్నాయి. ఆ వెంటనే సౌతాఫ్రికా జట్టుతో సిరీస్ మొదలు కానుంది.
సెప్టెంబర్ 28, అక్టోబర్ 2, 4 తేదీల్లో సౌతాఫ్రికాతో మూడు టి-20మ్యాచ్ లు తిరువనంతపురం, గువహటి, ఇండోర్ వేదికలుగా జరగనున్నాయి. ఈ మ్యాచ్ లకు రోహిత్ శర్మ సారధ్యం వహించనున్నాడు. ఆ తర్వాత జరిగే వన్డే సిరీస్ కు మాత్రం రోహిత్ శర్మతో పాటు మరికొందరు ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వనున్నారు. అక్టోబర్ నెలలో ఆస్ట్రేలియాలో మొదలు కానున్న టి-20 వరల్డ్ కప్ జరగనుంది. ఈ టోర్నమెంట్ లో పాల్గొనే ఆటగాళ్లకు కొంత విశ్రాంతి ఇచ్చేందుకే వన్డే జట్టు నుంచి వారికి మిహహా యింపు ఇవ్వనున్నారు.
వన్డే సిరీస్ కు శిఖర్ ధావన్ నేతృత్వం వహించనున్నాడు. ఇటీవల వెస్టిండీస్, ఐర్లాండ్, జింబాబ్వే జట్లతో జరిగిన వన్డే సిరీస్ లకు కూడా శిఖర్ సారధ్యం వహించాడు.
సౌతాఫ్రికా తో మూడు వన్డేలు అక్టోబర్ 6, 9, 11 తేదీల్లో లక్నో, రాంచి, ఢిల్లీ వేదికలుగా జరగనున్నాయి.
వన్డే సిరీస్ జట్టును త్వరలో బిసిసిఐ ప్రకటించనుంది.
Also Read : శిఖర్ ధావన్ సత్తా చాటాలి : లక్ష్మణ్