Sunday, January 19, 2025
Homeసినిమామహేష్ మూవీలో శోభన?

మహేష్ మూవీలో శోభన?

సూపర్ స్టార్ మహేష్‌ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ భారీ క్రేజీ మూవీ రూపొందుతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్న  ఈ మూవీలో మహేష్ కు జంటగా పూజా హేగ్డే, శ్రీలీల నటిస్తున్నారు.

తొలుత యాక్షన్ మూవీ అనుకున్నా తర్వాతా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దీన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే బాగా ఆలస్యం అవ్వడం వలన ఇక నుంచి ఎలాంటి గ్యాప్స్ లేకుండా నాన్ స్టాప్ గా షూటింగ్ చేసేలా పక్కా ప్లాన్ రెడీ చేశారని తెలిసింది.  ఈ నెల 18 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశారు. మొత్తం షూటింగ్ అంతా కూడా హైదరాబాల్లోనే ప్లాన్ చేశారు. కారణం ఏంటంటే.. విదేశాల్లో షూటింగ్ చేస్తే.. మరింత ఆలస్యం అవుతుంది కాబట్టి సాధ్యమైనంత త్వరగా కంప్లీట్ చేయాలని ఇలా ప్లాన్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

ఇక అసలు విషయానికి వస్తే… ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ శోభన ఓ కీలక పాత్రలో నటించనుందని టాక్ వినిపిస్తోంది. హీరోయిన్ గా తెలుగులో శోభనకి మంచి హిట్లు ఉన్నాయి. 2006లో వచ్చిన గేమ్ మూవీ తరువాత ఆమె మళ్లీ తెర పై కనిపించలేదు. అలాంటి శోభనను ఒప్పించే పనిలో త్రివిక్రమ్ ఉన్నాడని అంటున్నారు. చాలా కాలంగా నటనకు దూరంగా ఉంటూ వస్తున్న శోభన ఒప్పుకుంటుందా అనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాను ఆగష్టు 11న విడుదల చేయనున్నట్టుగా నిర్మాత ఇటీవల ప్రకటించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్