Shooter Rapolu Surabhi Bhardwaj :
భోపాల్ లో జరిగిన 64వ జాతీయ షూటింగ్ ఛాంపియన్ షిప్ లో పతకం సాధించిన రాపోలు సురభి భరద్వాజ్ ను రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లో అభినందించారు. హైదరాబాద్ కు చెందిన తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (SATS) చెందిన క్రీడాకారిణి రాపోలు సురభి భరత్వాజ్ 50 మీటర్స్ విభాగంలో సిల్వర్ మెడల్ సాధించి వరల్డ్ షూటింగ్ ఛాంపియన్ షిప్ లో పాల్గొనే భారత షూటింగ్ జట్టు ప్రాబబుల్స్ కు ఎంపికైనా సందర్భంగా మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (SATS) చెందిన షూటింగ్ రేంజ్ లో గత 5 సంవత్సరాలుగా షూటింగ్ ను ప్రాక్టీసు చేస్తున్న షూటింగ్ క్రీడాకారిణి రాపోలు సురభి భరత్వాజ్ 50 మీటర్స్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ కనబరచటం సంతోషకరమని, భవిష్యత్ లో తెలంగాణకు పేరు ప్రఖ్యాతులు తేవాలని మంత్రి ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం క్రీడా హబ్ గా మరబోతుందన్నారు. రాష్ట్రంలో అత్యుత్తమ క్రీడా పాలసీ ని రూపొందించబోతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సురభి భరత్వాజ్ తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Also Read : ఆన్ లైన్ బోధన కూడా ఉండాలి – హైకోర్టు