Monday, May 20, 2024
Homeస్పోర్ట్స్లంకతో టి 20 సిరీస్: ఇండియా కైవసం

లంకతో టి 20 సిరీస్: ఇండియా కైవసం

Another Series:  శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా మెరుపు బ్యాటింగ్ తో శ్రీలంకతో జరిగిన రెండో టి 20 మ్యాచ్ ను కూడా ఇండియా గెల్చుకొని సిరీస్ ను కైవసం చేసుకుంది.  లంక విసిరిన 184  పరుగుల లక్ష్యాన్ని 17.1 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి సాధించి ఏడు వికెట్ల విజయాన్ని అందుకుంది.

హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల స్టేడియంలో జరిగిన నేటి మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. శ్రీలంక ఇన్నింగ్స్ ధాటిగానే ఆరంభించింది తొలి వికెట్ కు 67 పరుగులు చేసింది. ఓపెనర్లు పాథుమ్ నిశాంక-75 (53బంతుల్లో 11ఫోర్లు); గుణతిలక-38 (29 బంతుల్లో 4ఫోర్లు, 2 సిక్సర్లు) చేయగా చివర్లో కెప్టెన్ దాసున్ శనక కేవలం 19 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 47 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడి అజేయంగా నిలవడంతో శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఇండియా బౌలర్లలో భువీ, బుమ్రా, హర్షల్ పటేల్, చాహల్, జడేడా తలా ఒక వికెట్ పడగొట్టారు.

ఇండియా 9 పరుగులకే కెప్టెన్ రోహిత్ శర్మ (1) వికెట్ కోల్పోయింది, 44 వద్ద మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ (16)కూడా ఔటయ్యాడు. ఈ దశలో శ్రేయాస్ అయ్యర్, సంజూ శామ్సన్ మూడో వికెట్ కు 84 పరుగులు జోడించారు. శామ్సన్ 39 పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన రవీంద్ర జడేజా, క్రీజులో ఉన్న అయ్యర్ లు లంక బౌలర్లపై విరుచుకుపడ్డారు. శ్రేయాస్ అయ్యర్ 44 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 74; జడేజా  18 బంతుల్లో 7 ఫోర్లు ఒక సిక్సర్ తో 45 పరుగులతో అజేయంగా నిలిచి 17.1  ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు. లంక బౌలర్లలో లాహిరు కుమార రెండు;  దుష్మంత చమీర ఒక వికెట్ సాధించారు.

శ్రేయాస్ అయ్యర్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది

రేపు ఆదివారం ఇండియా లంక మధ్య మూడవ మ్యాచ్ ఇదే స్టేడియంలో జరగనుంది

ఈ నెలలో ఇండియా స్వదేశంలో గెలిచిన రెండో టి 20 సిరీస్ కావడం గమనార్హం. ఇటీవలే వెస్టిండీస్ తో జరిగిన 20 సిరీస్ ను కూడా ఇండియా క్లీన్ స్వీప్ చేసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్