Saturday, January 18, 2025
Homeసినిమాశ్రుతి హాసన్ కి న్యూ ఇయర్ కలిసొచ్చేలానే ఉంది!

శ్రుతి హాసన్ కి న్యూ ఇయర్ కలిసొచ్చేలానే ఉంది!

ఇటు టాలీవుడ్ లోను .. అటు కోలీవుడ్ లోను శృతి హాసన్ కి మంచి క్రేజ్ ఉంది. ఇక బాలీవుడ్ ను కూడా ఒక ఊపు ఊపేమనుకునే రంగంలోకి దిగిందిగానీ, అంతలో ప్రేమ వ్యవహారంలో పడిపోయి ఆ విషయాన్ని మరిచిపోయింది. ఆ మత్తులో నుంచి ఆమె బయటపడేసరికి, బాలీవుడ్ లో మరింత పోటీ పెరిగిపోయింది. అక్కడ స్టార్ డమ్ రాకపోయినా, యూత్ లో క్రేజ్ ను మాత్రం సంపాదించుకోగలిగింది. అవకాశాల కోసం మళ్లీ ఆమె టాలీవుడ్ బాట పట్టింది.

ఆ సమయంలో గోపీచంద్ మలినేని ఆమెకి ‘క్రాక్’ సినిమాలో రవితేజ జోడీగా ఛాన్స్ ఇవ్వడం .. ఆ  సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఆమెకి కలిసొచ్చింది. ఆ తరువాతనే ‘వకీల్ సాబ్’ చేయడం .. ‘సలార్’లో అవకాశం దక్కడం జరిగింది. ‘సలార్’ సినిమా విడుదల ఇప్పట్లో లేకపోవడంతో అప్పటి వరకూ వెయిట్ చేయవలసిందేనా? అని అభిమానులు నిరాశ చెందారు. ఆ సమయంలోనే ఆమె  చిరంజీవి సినిమాకీ .. బాలయ్య మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

ఇటు చిరంజీవికీ .. అటు బాలయ్యకి ఉన్న మాస్ ఫాలోయింగ్ తెలియంది కాదు. చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ .. బాలయ్య ‘వీరసింహారెడ్డి’ .. ఈ రెండు సినిమాలు మాస్ కంటెంట్ పుష్కలంగా ఉన్నవే. అందువలన మాస్ ఆడియన్స్ ఈ సినిమాల కోసం వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ రెండు సినిమాలు సంక్రాంతికి రావడం .. ఒకరోజు తేడాతో విడుదలవుతుండటం మరో విశేషం. చిరూ .. బాలయ్య ఈ మధ్యకాలంలో ఇంత దగ్గరగా పోటీపడింది లేదు. ఈ సినిమాలు హిట్ కొడితే శ్రుతి హాసన్ కి న్యూ ఇయర్ కలిసొచ్చినట్టే అవుతుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్