Sunday, January 19, 2025
Homeసినిమాటైమ్ కలిసిరావడమంటే ఇదే!

టైమ్ కలిసిరావడమంటే ఇదే!

తెలుగు తెరకి నాజూకు సౌందర్యాన్ని పరిచయం చేసిన  కథానాయికలలో శ్రుతిహాసన్ ఒకరు. చక్కని కనుముక్కుతీరుతో  సన్నజాజి పువ్వులా ఉండే శ్రుతి హాసన్ కి కుర్రాళ్ల వర్గంలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లోను ఈ బ్యూటీకి మంచి ఫాలోయింగ్ ఉంది. కొంతకాలం క్రితం లవ్ ట్రాక్ లో పడిపోయి కెరియర్ కి కాస్త దూరంగా వెళ్లిన శ్రుతి హాసన్, ఇప్పుడిప్పుడే మళ్లీ కుదురుకుంటోంది. గతంలో తాను వదిలేసి వెళ్లిన టాలీవుడ్ పై గట్టిగానే పట్టు బిగిస్తోంది.

క్రితం ఏడాది ఆమె నుంచి ఏ సినిమా రాకపోయినా, ఆ వెలితిని ఈ ఏడాది భర్తీ చేసే విధంగానే ఆమె సినిమాలు ఉన్నాయి. బాలకృష్ణ కథానాయకుడిగా చేసిన ‘వీరసింహారెడ్డి’ సినిమాలో ఆమెనే కథానాయిక. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే వదిలిన పాటలన్నీ పాప్యులర్ అయ్యాయి. ఈ సినిమా మాస్ హిట్ కొట్టడం పక్కా అనే టాక్ బలంగానే వినిపిస్తోంది.

ఇక ఈ సినిమా విదుదలైన మరుసటి రోజునే చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ థియేటర్లకు రానుంది. ఇది కూడా మాస్ యాక్షన్ మూవీనే. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ అందించిన బాణీలు కూడా జనంలోకి ఒక రేంజ్ లో దూసుకుపోయాయి. చిరూతో శ్రుతి హాసన్ చేసే సందడి చూడటానికి ఫ్యాన్స్ ఉవ్విళ్లూరు తున్నారు. ఈ సినిమా కోసం మెగా అభిమానులు వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు. వసూళ్ల పరంగా ఈ సినిమా కొత్త రికార్డులు తిరగరాయడం ఖాయమనే టాక్ ఉంది.

ఇక ప్రభాస్ జోడీగా శ్రుతి హాసన్ చేసిన ‘సలార్’ ఈ ఏడాది చివరిలో రానుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇప్పటికే కొంత చిత్రీకరణను జరుపుకుంది. ఈ పాన్ ఇండియా మూవీతో శ్రుతి హ్యాట్రిక్ హిట్ అందుకోవడం ఖాయమని అంటున్నారు. ఒకానొక సమయంలో చేతిలో ఒక్క సినిమా లేకుండా చేసుకున్న శ్రుతి హాసన్ కి టైమ్ కలిసొచ్చిందనే టాక్ ఇప్పుడు అంతటా చెప్పుకుంటున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్