Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్Ind Vs. NZ: శుభ్ మన్ గిల్- బాదెన్ డబుల్

Ind Vs. NZ: శుభ్ మన్ గిల్- బాదెన్ డబుల్

ఉప్పల్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో ఇండియా 12 పరుగులతో విజయం సాధించింది  శుభ్ మన్  గిల్ డబుల్ సెంచరీతో విధ్వంసం సృష్టించడంతో ఇండియా విసిరిన 350 పరుగుల లక్ష్య ఛేదనలో కివీస్ చివరి వరకూ హోరాహోరీగా పోరాడి ఓడిపోయింది. కివీస్ బ్యాట్స్ మ్యాన్ బ్రేస్ వెల్ అద్భుతంగా రాణించి పోరాట స్ఫూర్తి ప్రదర్శించాడు.

టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్ మ్యాన్ శుభ్ మన్ గిల్ ఈ మ్యాచ్ లో రికార్డుల మోత మోగించాడు. వన్డేల్లో అతి పిన్న వయసులో డబుల్ సెంచరీ సాధించి ఇటీవలే రికార్డు సృష్టించిన ఇషాన్ కిషన్ ను అధిగమించి తన పేరిట ఆ ఘనతను లిఖించుకున్నాడు. వన్డేల్లో తొలి డబుల్ సెంచరీని  నమోదు చేశాడు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో న్యూ జిలాండ్ తో నేడు జరిగిన మ్యాచ్ లో 149 బంతుల్లో 19 ఫోర్లు, 9 సిక్సర్లతో 208 పరుగులు చేసి చివరి ఓవర్లో ఔటయ్యాడు.  సచిన్ టెండూల్కర్,వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ తరువాత వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన ఐదో ఆటగాడిగా గిల్ ఖ్యాతికెక్కాడు.

గిల్ తో పాటు రోహిత్ శర్మ 34, సూర్య కుమార్ యాదవ్ 31, హార్దిక్ పాండ్యా 28 పరుగులు చేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 349 పరుగులు సాధించింది. కివీస్ బౌలర్లలో శిప్లీ, డెరిల్ మిచెల్ చెరో రెండు; ఫెర్గ్యూసన్, టిక్నర్, శాంట్నర్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

కివీస్ బ్యాట్స్ మ్యాన్ మైఖేల్ బ్రేస్ వెల్ 78 బంతుల్లో 12 ఫోర్లు, 10 సిక్సర్లతో 140 పరుగులు చేసి చివరి ఓవర్ రెండో బంతికి అనూహ్యంగా ఎల్బీగా వెనుదిరిగాడు. దీనితో ఇండియా విజయం ఖాయమైంది. జట్టులో మిచెల్ శాంట్నర్-57;  ఫిన్ అల్లెన్ -40 పరుగులతో రాణించారు. 49.2 ఓవర్లలో 337 పరుగులకు కివీస్ ఆలౌట్ అయ్యింది.

ఇండియా బౌలర్లలో సిరాజ్ 4; కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ చెరో రెండు; షమీ, హార్దిక్ పాండ్యా చెరో వికెట్ పడగొట్టారు.

శుభ్ మన్  గిల్ కే ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్