Saturday, January 18, 2025
Homeసినిమా'టిల్లు స్క్వైర్' సిద్ధూ చేసిన ఓ మేజిక్!  

‘టిల్లు స్క్వైర్’ సిద్ధూ చేసిన ఓ మేజిక్!  

‘డీజే టిల్లు’ .. ఈ సినిమా బాక్సాఫీస్ బద్ధకాన్ని వదిలించివేసింది. టైటిల్ సాంగ్ ఈ సినిమాకి ప్రాణంగా నిలిచింది. ఇప్పటికీ ఈ సాంగ్ లేకుండా ఏ కాలేజ్ ఫంక్షన్స్ పూర్తికావు. మాస్ ఏరియాలో సైతం మారుమ్రోగిన పాట ఇది. హీరోను హీరోయిన్ మోసం చేయడమనే కాన్సెప్ట్ ను ఆడియన్స్ ఎంజాయ్ చేశారు. ఇలాంటి కథలు చాలా తక్కువగా రావడం వలన, వాళ్లకి ఇది కొత్తగానే అనిపించింది. అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ గా ‘టిల్లు స్క్వైర్’  నిన్న థియేటర్లకు వచ్చింది. ఫస్టు పార్టు చూపించిన ప్రభావం వలన, చాలా చోట్ల హౌస్ ఫుల్స్ పడ్డాయి.

ఫస్టు పార్టులో ఒక అందమైన యువతి చేతిలో హీరోయిన్ బకరా అవుతాడు. అందువలన ఈ సారి హీరోయిన్ మారినా .. ఆమె ప్లానింగ్ మారినా హీరో బకరా కావడం ఖాయమనే విషయం ఆడియన్స్ కి తెలిసిపోతుంది. కాకపోతే ఆ తతంగం ఎలా జరుగుతుందనేది తెలుసుకోవడం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఆడియన్స్ ఆశించినట్టే తెరపై కథ పరిగెడుతూ ఉంటుంది. నాన్ స్టాప్ కామెడీతో .. అక్కడక్కడా లిప్ లాకులను యాడ్ చేసుకుంటూ సన్నివేశాలు సాగిపోతూ ఉంటాయి.

ఈ సినిమా హిట్టా .. కాదా అనే విషయంలో క్లారిటీ కోసమే చాలామంది వెయిట్ చేస్తుంటారు. హిట్టా అంటే హిట్టే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఫస్టు పార్టుతో సమానమైన కంటెంట్ తో ఈ సినిమా నడుస్తుంది. యాసతో కూడిన డైలాగ్స్ తో .. అమాయకమైన ఎక్స్ ప్రెషన్స్ తో తెరపై హీరో చేసే మేజిక్ లలో లాజిక్కులు కొట్టుకుపోతాయి. కథగా చూస్తే చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ ఉండదు. కానీ యూత్ పల్స్ .. మాస్ పల్స్ పట్టుకుని, మొదటి నుంచి చివరివరకూ నవ్విస్తూ ముందుకెళ్లే కంటెంట్ ఇది. అందువలన వసూళ్ల విషయంలో ఢోకా ఉండదనే చెప్పుకోవాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్