Saturday, November 23, 2024
Homeసినిమా‘సిగ్గెందుకు రా మావ’ పాట‌కు అనూహ్య స్పంద‌న‌

‘సిగ్గెందుకు రా మావ’ పాట‌కు అనూహ్య స్పంద‌న‌

‘రాజావారు రాణిగారు’ ఫేమ్, యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం, ‘టాక్సీవాలా’ ఫేమ్ ప్రియాంక జ‌వాల్క‌ర్ జంట‌గా ఎలైట్ ఎంట‌ర్ టైన్మెంట్స్ ప‌తాకం పై ప్ర‌మోద్ – రాజు నిర్మాత‌లుగా, నూత‌న దర్శ‌కుడు శ్రీధ‌ర్ గాదే తెరకెక్కించిన సినిమా SR క‌ళ్యాణమండంపం EST 1975. ఈ సినిమా టైటిల్ ఎనౌన్స‌మెంట్ ద‌గ్గ‌ర నుంచి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్లో ఓ ఆస‌క్తిని క్రియేట్ చేసుకుంది. ఆ త‌రువాత విడుద‌ల చేసిన ‘చుక్క‌ల చున్ని, చూసాలే క‌ళ్లార’….. పాట‌ యూట్యూబ్ లో మిల‌య‌న్స్ కొద్దీ వ్యూస్ తెచ్చుకోవ‌డ‌మే కాకుండా సోష‌ల్ మీడియాలో సైతం ట్రెండ్ అవుతోంది.

టీజ‌ర్ కి సైతం అంతటా అనూహ్య స్పంద‌న ల‌భించ‌డ‌మే కాకుండా, టాలీవుడ్ ట్రేడ్ వ‌ర్గాల్లో SR క‌ళ్యాణమండంపం EST 1975 చిత్రం హాట్ టాపిక్ గా మారడం విశేషం. ఈ సినిమాను థియేటర్ లోనే విడుదట చేస్తామంటూ దానికి తగ్గ ఏర్పాట్లు నిర్మాత‌లు చేస్తున్నారు.. ఇటీవ‌లే శంక‌ర్ పిక్చ‌ర్స్ వారు ఈ చిత్రానికి సంబంధించిన వ‌ర‌ల్డ్ వైడ్ రైట్స్ ను ఫ్యాన్సీ రేటుకి ద‌క్కించుకున్నారు. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు చేత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆడియో ఆల్బ‌మ్ నుంచి మ‌రో పాట‌ విడుద‌లైంది.

‘సిగ్గెందుకు రా మావ’ అంటూ సాగే ఈ పాట‌ను స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ విడుద‌ల చేశారు. ఈ పాట‌లో హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం డాన్స్ మూమెంట్స్ అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటున్నాయి, అలానే సంగీత ద‌ర్శ‌కుడు ఈ పాట‌కు అందించిన ట్యూన్స్, ప్ర‌ముఖ సింగర్ అనురాగ్ కుల‌కుర్ణి అద్భుత‌మైన వాయిస్ సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇక ఈ సినిమాలో హీరోగా న‌టించ‌డ‌మే కాకుండా క‌థ‌, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ని సైతం కిర‌ణ్ అబ్బ‌వ‌రం అందించ‌డం విశేషం. విల‌క్ష‌ణ న‌టుడు, డైలాగ్ కింగ్ సాయికుమార్ ఈ సినిమాలో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఆయ‌న పాత్ర ఈ చిత్రానికి ప్ర‌ధాన ఆకర్ష‌ణ‌గా నిల‌వ‌నుంద‌ని ద‌ర్శ‌కుడు శ్రీధ‌ర్ గాదే తెలిపారు. థియేటర్లు అందుబాటులోకి రాగానే సినిమా విడుదల కానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్