Monday, April 7, 2025
HomeTrending Newsతర్న్‌ తరన్‌ దాడి మా పనే...సిఖ్స్ ఫర్ జస్టిస్

తర్న్‌ తరన్‌ దాడి మా పనే…సిఖ్స్ ఫర్ జస్టిస్

పంజాబ్‌లోని తర్న్‌ తరన్‌లో దాడి ఖలిస్తాని వేర్పాటువాదుల పనే అనే పోలీసులు ప్రకటించారు. సిఖ్స్ ఫర్ జస్టిస్ (SFJ) సంస్థ తామే ఈ దాడికి పాల్పడినట్టు  ప్రకటించింది. ఈ దాడిలో విదేశీ హస్తం ఉందని పంజాబ్ డిజిపి గౌరవ్ యాదవ్ అనుమానం వ్యక్తం చేశారు. సిఖ్స్ ఫర్ జస్టిస్ (SFJ) సంస్థపై విచారణ జరుపుతున్నామని డిజిపి పేర్కొన్నారు.

శనివారం తెల్లవారుజామున 1 గంటల సమయంలో దుండగులు ఏకంగా పోలీస్‌ స్టేషన్‌పై రాకెట్‌ గ్రనేడ్‌తో దాడికి పాల్పడ్డారు. పోలీస్ స్టేషన్‌ బయటి పిల్లర్‌కు రాకెట్‌ గ్రనేడ్‌ తగిలింది. అయితే పిల్లర్‌కు తగిలిన తర్వాత అది ఎగరడంతో భారీ ప్రమాదం తప్పింది. స్టేషన్‌ స్వల్పంగానే ధ్వంసమయిందని, ఎవరి ఎలాంటి ప్రమాదం జరుగలేదని అధికారులు తెలిపారు. అప్రమత్తమైన పోలీసులు ఆ ప్రాంతంలో గాలింపు మొదలు పెట్టారు. రాకెట్‌ చాలా శక్తివంతమైనదని అయితే పిల్లర్‌కు ఢీకొట్టిన తర్వత అది మళ్లీ ఎగరడంతో స్టేషన్‌ను ధ్వంసం చేయలేకపోయిందని నిపుణులు వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్