Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్ఆసియా బ్యాడ్మింటన్: సెమీస్ లో సింధు

ఆసియా బ్యాడ్మింటన్: సెమీస్ లో సింధు

BAC-2022: భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్స్-2022 లో సెమీ ఫైనల్స్ కు చేరుకుంది. నేడు జరిగిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో చైనా క్రీడాకారిణి హే బింగ్ జియావో పై 21-9; 13-21; 21-19 తేడాతో విజయం సాధించింది.

ఒక గంటా 16 నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్ లో తొలి సెట్ ను అవలీలగా గెల్చుకున్న సింధు రెండో సెట్ ను కోల్పోయింది. హోరాహోరీగా సాగిన నిర్ణాయక మూడో సెట్ లో సింధు తన ఆటతీరుకు పదును పెట్టి విజయం సాధించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్